ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ఓ వెబ్ సైట్ పై ఫైర్ అయ్యాడు. బాబు కోపాన్ని చూస్తుంటే భయమేస్తుంది అబ్భా అని వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు నెటిజన్లు. సాహూ సినిమాపై పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది అని ఒక ఆర్టికల్ రాసింది ఓ వెబ్ సైట్. 


సాధారణంగా పచ్చ పార్టీపై వచ్చే ఆర్టికల్స్ చూస్తే అన్ని నిజాలే రాశారు అనిపిస్తుంది. ఎందుకంటే బాబులు ప్రజల ముందు ఒకలా వెనక ఒకలా ప్రవర్తిస్తారు అని సోషల్ మీడియా వేధికగా ఎంతోమంది నెటిజన్ల కామెంట్లు చూస్తూనే ఉన్నారు. ఇక పోతే నారా లోకేష్ కి ఏ ఆర్టికల్స్ కి స్పందించాలి ? ఏ ఆర్టికల్స్ కి స్పందించకూడదు అనే చిన్న కామన్ సెన్స్ కూడా లేదు అని అంటున్నారు నెటిజన్లు. 


చంద్రబాబు నాయుడుకి మతిస్థిమితం సరిగ్గా లేదు అన్నప్పుడు లోకేష్ కి కోపం రాలేదు.. లోకేష్ ని పప్పు అన్నప్పుడు కోపం రాలేదు.. బుద్ధా వెంకన్న, కేశినేని నాని ట్విట్టర్ లో గొడవ పెట్టుకొని టీడీపీ పార్టీ పరువు తీసినప్పుడు ఏ మాత్రం లోకేష్ కి కోపం రాలేదు. కానీ ఒక సినిమాపై పచ్చ పార్టీ బురద జల్లుతుంది అన్ని ఆర్టికల్ రాసినందుకు లోకేష్ బాబుకి పీకల్లోతుల్లో కోపం వచ్చింది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  


మరికొందరు స్పందిస్తూ 'ఏంటి బాబు .. వెబ్ సైట్ క్లోజ్ చెయ్యాలనుకుంటున్నావా ? మీ నాన్న వల్లే కాలేదు ఇక నీ వల్ల అవుతుందా పప్పు' అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనప్పటికి అనవసర విషయాలకు కోపం తెచ్చుకొని నెటిజన్లకు బుక్ అవుతుంటారు లోకేష్. 


మరింత సమాచారం తెలుసుకోండి: