ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసాయి. వైయస్ఆర్సిపి ఎమ్మెల్సీలుగా మోపిదేవి, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎంపికైన వారంతా ఎమ్మెల్సీ లుగా ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. అధికారికంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించారు. మూడింటికి మూడు స్థానాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఏడవ తేదీ నుంచి నామినేషన్ లు వేశారు.

అయితే మూడు నామినేషన్ లు మాత్రమే దాఖలయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ, ఒక ఒసీ, ఒక మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురికీ అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకట రమణ, అలాగే మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్, అలాగే మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురు వైయస్ఆర్ పార్టీ తరపునుండి నామినేషన్ లు వేయడం జరిగింది. తెలుగు దేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం లేదు. బలం లేనందున తెలుగు దేశం పార్టీ పోటీ నుండి కూడా తప్పుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను కూడా ఏకగ్రీవంగా దక్కించుకుంది.


కొద్ది సేపటి కిందట ఆ ఇద్దరూ ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్ధులు ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి మోపిదేవి వెంకట రమణ ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడుగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటినుంచి కూడా గతంలో వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.  మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి బీసీ నాయకుడు మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక్బాల్ మొన్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గం నుండి పోటీ చేశారు


ఐపీఎస్ అధికారిగా రిటైరైనప్పటినుండీ కూడా వైయస్సార్ పార్టీలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఇక్బాల్ కి మైనారిటీ కోటాలో అవకాశం ఇవ్వడం జరిగింది.అలాగే కర్నూలు జిల్లా నుండి చల్లా రామకృష్ణారెడ్డి సీనియర్ పొలిషియన్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గతంలో పని చేశారు. ఎన్టీఆర్ హయాంలో, రాజశేఖర్ రెడ్డి హయాంలో, చంద్రబాబు హయాంలో కూడా పని చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి  జగన్మోహరెడ్డి అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు ఇక్బాల్,చల్లా రామకృష్ణ  ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ త్వరలో ధ్రువీకరణ పత్రం తీసుకోబోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: