పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి నివేదిక పంపాలని పోలవరం అథారిటీని కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఒ ఆర్ కె జెయిన్ ఇటీవల జరిగిన పోలవరం పీపీఏ సమావేశం తర్వాత వినయ పూర్వకమైనటువంటి సలహాలు ఇస్తున్నాం, పోలవరం రివర్స్ టెండరింగ్ కి వెళ్ళవద్దు, కీలకమైనటువంటి దిశలో కాంట్రాక్ట్ ను రద్దు చేయవద్దంటూ ఆర్ కె జెయిన్ అన్నారు. మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్నది చేసింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

సాగు నీటి ప్రాజెక్ట్ లో ఏదైతే మిగిలిన ఎబ్రాప్స్ పనులు, అదేవిధంగా జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులకు సంబంధించి తిరిగి టెండర్ లను పిలిచారు. అంతేగాకుండా సకాలంలో ప్రాజెక్ట్ లు పూర్తయ్యేలా దీవించాలని కూడా గత శనివారం పోలవరం ప్రాజెక్ట్ వద్ద  గోదావరి నదికి చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు వీళ్ళందరు కూడా పూజలు చేయడం, ఆ తరువాత మొత్తం రివర్స్ టెండరింగ్ ఎందుకు పిలిచామన్న దాని మీద కూడా కేంద్రం రెండు సార్లు లేఖలు రాసింది. అయినప్పటికి కూడా కేంద్రం రాసినటువంటి లేఖలను పట్టించుకోకుండా రీటెండరింగ్ చేయటాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.

గజేంద్ర షెకావత్ కూడా ఇదే అంశాన్ని ఏదైతే పోలవరం టెండర్ లను రద్దు చేసిన రోజే పార్లమెంట్ లోక్ సభలో టీడీపీ ఎంపీ లేవదీసినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానమిస్తూ,  పోలవరం టెండర్ లను రద్దు చేయడం వల్ల చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది, అంతేగాకుండా ఖర్చు కూడా అధికమవుతుందని కూడా షెకావత్ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పారు. ఈ విధానమైనటువంటి ధోరణి మంచిది కాదని షెకావత్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.  ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ విధంగా చేయవద్దని ఆదేశాలను జారీ చేసింది


అయినప్పటికి గత శనివారం రీటెండరింగ్ చేయడాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులతో ఫోన్ లో స్వయంగా మాట్లాడారు. కొంతమందిని డిల్లీకి కూడా పిలిపిచ్చుకుని పోలవరం ప్రోజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తనకి కావాలని ఆయన పీపీఏ అధికారులను కోరారు. ప్రస్తుతం కేంద్రం కోరినటువంటి నివేదికను తయారీలో పీపీఏ అధికారులున్నారు.

ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేయబోతున్నాము, ఆ తర్వాత కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రీ టెండరింగ్ ప్రక్రియపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది రివర్స్ చేస్తుందన్న అభిప్రాయమైతే పీపీఏ అధికారుల నుంచి అంధుతున్నటువంటి సమాచారం. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: