ఏపీ ఎన్నికల్లో  టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం  టీడీపీ లోకల్ నాయకులతో పాటు ఎల్లో మీడియా కూడా ప్రధాన కారణం అని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ చెప్పుకుని  ఫీల్ అవుతుంటారు.  ఒకపక్క  జాతీయ మీడియా  టీడీపీ ఓట‌మి పాల‌వుతుంద‌ని కోడై కూస్తే  ఎల్లో మీడియా మాత్రం టీడీపీకి 150 సీట్లు  పైమాటే అంటూ బాకా ఊది బాబుగోర్ని పూర్తిగా త‌ప్పుదారి ప‌ట్టించాయి.   వాస్త‌వాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ప్పి ఉంచుతూ  అంతా ఓకే అన్న ధోర‌ణికి బాబుగోర్ని తీసుకువచ్చారట.  త‌ప్పుడు క‌థ‌నాల‌తో ప్రజలను కూడా మోసం చేసి..  త‌ద్వారా  భారీగా ఓట్లు పొందొచ్చు అని ఎల్లో మీడియా ప్లాన్. కానీ ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయింది.  దాంతో టీడీపీ పరిస్థితి మ‌రింత‌గా దిగ‌జారింది. మొత్తానికి బాబు అధికారం కోల్పోయారు. అయినా ఎల్లో మీడియా మాత్రం టీడీపీకి వ‌త్తాసు ప‌లుకడం మాత్రం ఆపలేదు. బాబు పై స‌ద‌రు మీడియా వ‌ర్గాల్లో మార్పులేవీ క‌నిపించ‌డం లేదు.  మెయిన్ మీడియా సంస్థ‌లన్నీ కమ్మ సామాజిక వ‌ర్గానికే చెందినవి కావడమే దీనికి ప్రధాన కారణమట.  దాని వల్లే బాబుగోరు ఆడిందే ఆట పాడిందే పాట‌ మాదిరిగా ఎల్లో మీడియా కుడా ఆడిపాడిందట.    


ఈ ఎల్లో మీడియాను  ప్ర‌జ‌లు ఛీకొట్టేలా చేయాలని వైసీపీ ప్రణాళికలు వేస్తోందట.  జ‌ర్న‌లిజం విలువ‌ల్ని దిగ‌జార్చే వారిని నిలువరించే దిశగా జగన్ ప్రభుత్వం  త్వరలో చర్యలు కూడా తీసుకోబోతుందని ఆ ఆమధ్య వార్తలు వచ్చాయి.  మొత్తానికి త్వరలోనే అమలు చేసేలా జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  'వై ఎస్ జగన్' తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారుతున్నాయి. తన మార్క్ పాలనతో జగన్ దూసుకుపోతున్నాడు. ఏది ఏమైనా కొన్ని విషయాల్లో జగన్ కేసీఆర్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే  బాబు మరియు ఆయన పుత్రరత్నం చిన్నబాబు కలిసి  జగన్ పై  పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎల్లో మీడియా మీద జగన్ పడితే... ఇక బాబులిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: