ఏపీ సీఎం జగన్ ఇప్పటికే చాలా క్లియర్ గా చెప్పారు. రాష్ట్రంలో అవినీతి ఏ రూపంలో ఉన్న అసలు క్షమించనని, సమూలంగా ప్రక్షాళన చేస్తానని చెప్పారు. దేశంలోనే ఏపీ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా మారుస్తానని ఇప్పటికే పదే పదే చెప్పారు. దానికి తగ్గట్టుగా ఎన్నో చర్యలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు.


అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. ఇంకా చెప్పాలంటే జగన్ తన మంత్రులు కూడా ఎక్కడ అవినీతిలో ఉండకుండా వారికి గట్టిగా హెచ్చరికలు చేశారు. వారిని నిరంతరం కనిపెట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. 


గత ప్రభుత్వంలో ఇంటెలిజెంట్ వ్యవస్థను స్వయంగా తన మంత్రుల మీద పెట్టిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి పోయారు. అయినా టీడీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకూడదని జగన్ బలంగా ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఖర్చు కోటి రూపాయలు దాటితే దాని వివరాలు వెబ్ సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఎవరైతే తక్కువగా కోట్ చేస్తారో వారికే ఆ కాంట్రాక్టు దక్కే విధంగా చేస్తారు. ఇలాప్ ప్రతి విషయంలో జగన్ పారదర్శత తీసుకురావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. దీనితో రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: