ముఖ్యమంత్రి జగన్ తనదైన పాలనను ఏపీలో అందిస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటి చేసుకుంటూ ముందుకుపోతున్నారు. ఇందుకోసం ఒక టైం టేబిల్, టైం బాండ్ ప్రొగ్రాం ని కూడా జగన్ డిజైన్ చేసి పెట్టుకున్నారు. దాని ప్రకారం పధకాల  క్యాలండర్లో డేట్  గడిస్తే చాలు ఫేట్ మార్చేసే   స్కీములను జగన్ అమ్ముల పొది నుంచి బయటకు తీస్తున్నారు. ఇపుడు మరో కొత్త ప్లాన్ తో జగన్ జనం ముందుకు వస్తున్నారు.


జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21. ఆ రోజు నుంచి ఏపీలో కొత్తగా స్మార్ట్ ఆరోగ్ర్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టేందుకు ఏపీ సర్కార్ రెడీగా ఉంది. దానికి సంబంధించిన  యాక్షన్ ప్లాన్ని ఇపుడు రూపొందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రకారం చూస్తే ప్రతి కుటుంబం ఆదాయం అయిదు లక్షలకు మించకుండా ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపచేస్తారు. వేయి రూపాయలు వైద్య ఖర్చు మించితే చాలు ఆ మీదట దాన్ని  ప్రభుత్వమే భరిస్తుంది.


దాంతో పేదలకు ఇక వైద్యం అందుబాటులోకి వస్తుంది. అనారోగ్యమైతే ఇల్లు గుల్ల చేసుకోనవసరం లేకుండా చేతిలో స్మార్ట్ హెల్ట్ కార్డ్ వుంచాలన్నది జగ‌న్ సర్కార్ విధానంగా ఉంది. జగన్ నవరత్నాల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని అమలు చేస్తున్నారు. ఆ విధంగా తన పుట్టిన రోజున ఓ అరుదైన గిఫ్ట్ ని ఏపీ ప్రజలకు అందించనున్నారు.


ఇదిలా ఉండగా ఈ స్మార్ట్ హెల్త్ కార్డ్ స్కీం ని తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశపెడతారు. అక్కడ ఈ ప్రయోగాత్మకమైన పధకం విజయవంతం అయిందాన్ని బట్టి చూసుకుని మరిన్ని మెరుగులతో రాష్ట్రమంతంటా అమలు చేయాలన్నది వైసీపీ సర్కార్ విధానంగా ఉంది. మొత్తానికి స్మార్ట్ హెల్త్ కార్డ్ చేతిలో ఉంటే ప్రతీ పేదవాడికి అది బ్రహ్మాస్త్రంగా  ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి జగన్ అదిరే గిఫ్ట్ పై జనాల స్పందన ఎలా ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: