ప్రభుత్వానికి చెందిన ఫర్నీచర్ తరలింపు కేసులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అడ్డంగా దొరికిపోయారు. లక్షల రూపాయల విలువైను ఫర్నీచర్ ను ప్రభుత్వానికి అప్పగించకుండా తన ఇంటికి తరలించుకుపోయారు. దాంతో నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ విషయంలో పోలీసులు విచారణ కూడా మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఫర్నీచర్ తన నవాసంలో ఉందని మీడియా సమావేశంలో కోడెల అంగీకరించారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే 2017లో హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ తరలినపుడు విలువైన ఫర్నీచర్ మాయమైపోయింది. ఇక్కడ అసెంబ్లీ నుండి అమరావతిలోని అసెంబ్లీకి రావాల్సిన ఫర్నీచర్ రాలేదు. అధికారులు ఎక్కడ వెతికినా కనబడలేదు. మాయమైన ఫర్నీచర్ కోడెల ఇంటిలోనే ఉందని అందరికీ తెలుసు. అయినా అధికారంలో ఉంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోయారు.

 

అయితే ప్రభుత్వం మారిన నేపధ్యంలో ఫర్నీచర్ మాయమైన విషయం పెద్ద వివాదాస్పదమదైంది. స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు విచారణకు రంగంలోకి దిగారు. దాంతో తనను ఏ నిముషంలో అయినా అరెస్టు చేస్తారన్న భయం కోడెలకు పట్టుకుంది. దాంతో పోలీసుల విచారణ మొదలైన రెండో రోజే ఫర్నీచర్ తన వద్దే ఉందని కోడెల ఒప్పుకున్నారు. ఫర్నీచర్ కు అసెంబ్లీలో భద్రత లేదన్న కారణంతోనే కంప్యూటర్లు, ఫర్నీచర్ తన క్యాంపు కార్యాలయంలోను, ఇంటిలోను పెట్టుకున్నట్లు కథలు చెబుతున్నారు.

 

అరెస్టు భయంతోనే ఇపుడు కోడెల ఫర్నీచర్ తరలింపును అంగీకరించారు. ప్రభుత్వం దగ్గరే ఫర్నీచర్, కంప్యూటర్లకు భద్రత లేకపోతే కోడెల ఇంటిలో మాత్రం భద్రంగా ఎలాగుంటుంది. అడ్డంగా దొరికిపోయి అరెస్టు తప్పదని తెలిసిన తర్వాతే తన కక్కుర్తిని ఒప్పుకున్న విషయం తెలిసిపోతోంది. అసెంబ్లీ సిబ్బది ఫర్నీచర్ విషయమై లేఖలు రాసినా స్పందించని కోడెల చివరి నిముషంలో బయటపడ్డారని తెలిసిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: