వైసిపి నాయకులు మరియు కార్యకర్తలంతా ఏందిరా చంద్రబాబు ఇంత సైలెంట్ గా ఉన్నాడు…అసెంబ్లీలో మొదలుపెట్టి ఎక్కడపడితే అక్కడ బలమైన దెబ్బలు వేస్తున్నా... కనీసం నోరు కూడా మెదపడం లేదు అని ఒకపక్క అనుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంగల చంద్రబాబు ఇన్ని రోజులు తన వంతు కోసం ఎదురుచూస్తున్నాడని తెలియదు వారికి పాపం. చూసి… చూసి ఒక్కసారిగా బలంగా కోలుకోలేని దెబ్బ వేసాడు చంద్రబాబు.

కొన్ని రోజుల ముందు చంద్రబాబు ఇంటి పై డ్రోన్లు తిరుగాడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై చంద్రబాబు ఇంటి దగ్గర ఉన్న టిడిపి కార్యకర్తలు మరియు నేతల ఆరోపణలపై డ్రోన్లు ఎగరేసిన వారిని అరెస్టు చేశారు కూడా. వారేమో ఒకసారి జగన్ తమని పంపించాడు అని చెప్తే ఇంకొకసారి జగన్ ఇంటిలో ఉండే కిరణ్ పంపించాడు అని అన్నారు. వైసీపీ నేతలు మాత్రం వరద ముప్పు అని అంచనా వేసేందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వరద ముప్పును అంచనా వేసేందుకు ఆ డ్రోన్లను అటువైపు ఎగరవేశారు అని చెబుతున్నారు. ఇన్ని సమాధానాలు విన్నాక మన చంద్రబాబు ఆగుతాడా?

చంద్రబాబు ముందుగా జగన్ ని ఒక రేంజ్ లో వేసుకున్నారు. రాష్ట్రంలో అందరూ వరదలతో ఇంత అల్లాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం టూర్లు తిరుగుతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా జగన్ రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దకుండా అక్కడ విలాసాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో వైపరీత్యాలను సరైన యంత్రాంగం, అధికారులను వాడి వాటిని అరికట్టానని ఆయన అన్నారు. ఉదాహరణకు హూద్ హుద్ తుఫాను గురించి వివరించాడు.

తర్వాత అతని ఇంటిపై డ్రోన్లు తిరుగాడిన విషయం గురించి ప్రస్తావించాడు. అసలు ఎం.సి.పి.టి సెక్యూరిటీ ఉన్న తన ఇంటి పై డ్రోన్లు తిరగడం ఏంటి అని ఆయన ప్రశ్నించాడు. అసలు ఎన్.ఎస్.జి పర్మిషన్ లేకుండా ఇటువంటి పనులు చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన అన్నాడు. తమ కార్యకర్తలు చెప్పినట్టు అతనిపై హత్యాప్రయత్నం లాంటివి కూడా చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. ఇదే విషయమై డీజీపీతో కూడా మాట్లాడిన చంద్రబాబు అతను ఇచ్చిన వివరణకు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమైన జగన్ తన అమెరికా టూర్ నుండి హుటాహుటిన బయలుదేరనున్నాడని సమాచారం. ఇప్పుడు జగన్ తిరిగి వస్తే కానీ ఆ డ్రోన్లు ఎవరు ఎందుకు పంపించారో…అసలు తన ఇంట్లో ఉన్న ఆ కిరణ్ ఎవరో బయటకు రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: