హైదరాబాద్ నుండి అమరావతి కి అసెంబ్లీ తరలించిన సమయంలో అసెంబ్లీకి సంబందించిన ఫర్నిచర్ ను అక్రమంగా తరలించిన వ్యవహారం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు చుట్టుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి అసెంబ్లీ తరలి వెళ్లిన సమయంలో హైదరాబాద్ ఆఫీస్ కు చెందిన ఫర్నిచర్ ను ఎవరికి చెప్పకుండా కోడెల గుంటూరు, సత్తెనపల్లిలలోని తన క్యాంప్ కార్యాలయాలకు, తరలించారని ఆరోపణ వచ్చింది.అదికారులకు కూడా సమాచారం చెప్పకుండా కోడెల ఇలా లారీలలో తరలించారని ఆరోపణ, 


కొత్త ప్రభుత్వం రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.  ఈ వ్యవహారంలో కోడెలపై కేసు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే కోడెల వివరణ ఇస్తూ తాను పర్నిచర్ ను తీసుకు వెళ్లిన మాట నిజమేనని, అయితే హైదరాబాద్ అసెంబ్లీలో ఫర్నిచర్ కు బద్రత, నిర్వహణ ఉండదని తాను తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ పర్నిచర్ తీసుకువెళ్లాలని అదికారులకు చెప్పానని ఆయన అన్నారు. లేదా ఫర్నిచర్, కంప్యూటర్ల కు ఎంత విలువ అవుతుందో లెక్క చెబితే దానిని చెల్లిస్తానని ఆయన అన్నారు. 


అయితే పోలీసులు కేసు పెట్టబోతున్న తరుణంలో కోడెల ఇప్పుడు డబ్బు చెల్లిస్తానని అంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. కోడెల మరీ అంత కక్కుర్తి కాండిడేటా? అని చాలా మంది సోషల్ మీడియా లో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉంటే ఆ సామాగ్రి కోడెల వశం అయిపోయేది. ఇది ఇలా ఉండగా అధికారం మారినప్పటి నుండి కోడెల మీద కొత్త ప్రభుత్వం అనేక కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. దీని తో ఆయనను బీజేపీలోకి వెళ్లాల్సిందిగా చాలా మంది అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ తలపోటుని బీజేపీ మీద వేసుకుంటుందా అనేది అసలు ప్రశ్న. 


మరింత సమాచారం తెలుసుకోండి: