గోదావరి చల్లంగా ఉంటే  నీరు ఇస్తుంది. ఉగ్ర రూపం దాలిస్తే ప్రాణాలు అరచేత పెట్టుకోవాల్సిందే. ఆ తల్లి ఉరకలు పరుగులు పెడుతూంటే చూడడానికి ఎంత హాయిగా ఉంటుందో భీకరంగా దూసుకువస్తుంటే అంత భయానకంగా ఉంటుంది. ఈ నెల మొదట్లోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ఎగువ రాష్ట్రాల నుంచి పొంగి పొరలిన నీటితో అఖండ గోదావరి గర్జించింది. వారం రోజుల పాటు నదీ పరీవాహిక ప్రాంతాల ప్రజలూ హడలిపోయారు. ప్రాణాలకు చిక్కబెట్ట్టుకుని బతికారు. ఇపుడు మళ్ళీ గోదావరికి వరదలు అంటున్నారు.


ఇంకా గొడ్డూ గోదా సర్దుకుంటున్నారు. వరద మిగిలిచిన బీభత్సం నుంచి తేరుకుంటున్నారు. ఇంతలో మరో మూడు రోజుల పాటు గోదావరికి వరదలు అన్న వార్త ఇపుడు గోదావరి పరిసరప్రాంతాల ప్రజలకు షాక్ కలిగిస్తోంది. గోదావరి మళ్ళీ ఆగ్రహిస్తే ఎలా అంటూ తల్లడిల్లుతున్నారు. గోదావరికి మరోసారి వరదలు వస్తాయని ఆర్జీఎస్ ఈ రోజు  హెచ్చరించింది. 


ఉపనదులైన శబరి ఇంద్రావతిల్లో భారీగా వానలు ఈ రోజు నుంచి కురిసే అవకాశాలు ఉండడంతో గోదావరికి వరదల ముప్పు పొంచి ఉందని ఆర్జీఎస్ వెల్లడించింది. అందువల్ల గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీఎస్ హెచ్చరించింది.  ఓ విధంగా చెప్పాలంటే ఒకే నెలలో ఇలా గోదావరికి వరదలు రావడం అంటే తట్టుకోవడం కష్టమే


ఇప్పటికే పంటలు అన్నీ సర్వనాశనం అయి అంతా కోల్పోయిన ప్రజానీకం మరో మారు వరదలు అన్న మాట వింటేనే భయపడిపోతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే గోదావరి, క్రిష్ణా వరదల సహాయ  కార్యక్రమాల్లో వూపిరి లేని పనుల్లో ఉండగానే  మళ్ళీ గోదావరి వరదలు అంటే ఉరుకులు పరుగులు పెట్టాల్సివస్తోంది. ప్రభుత్వం అధికారులు వరదల బారిన ఎవరూ పడకుండా ప్రాణనష్టం లేకుండా చూదాల్సిన బాధ్యతను గట్టిగా నెరవేర్చాల్సివుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: