చంద్రబాబు మాటలు, రాజకీయాలు ఎపుడూ చిత్రంగానే ఉంటాయి. ఆయనకు ఆకాశంలో అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. కానీ మిగిలిన వారికి కూడా కనిపించాలిగా. బాబు మాత్రం తనకు కనిపించింది కాబట్టి అందరినీ నమ్మమంటారు. తన కళ్ళతో చూడమంటారు, తన మెదడుతో ఆలోచించమంటారు. చంద్రబాబుకు అమరావతి అద్భుతమైన రాజాధాని, ఆయన ద్రుష్టిలో అది ప్రపంచంలో అత్యద్భుతమైన నగరం. కానీ జనాలకు అక్కడ ఏమీ లేదంటే బాబు గారు అసలు  వినరే.


వైసీ సీనియరె మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి గురిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. అందులో  మంత్రిగారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అమరావతి జోన్ భూకంపాలు, వరదలకు నిలయం అని అప్పట్లో శివరామక్రిష్ణ కమిషన్ కూడా చెప్పింది. అందులో నిపుణులు ఉన్నారు. పోనీ బొత్సకు ఏమీ తెలియదు అనుకుంటే నిపుణులు చెప్పిన మాట కూడా బాబుకు ఎక్కలేదు. అందుకే తనకు తానుగా తన భజన బ్రుందంతో కమిటీ వేసి అమరావతి రాజధానిగా  దూకుడుగా వన్ సైడెడ్ గా డిక్లేర్ చేశారు. పోనీ ఏపీలో ఏమీ లేని చోట ఏదో ఒక రాజధాని వస్తుందని జనం అనుకున్నారు.


కానీ అయిదేళ్లలో చంద్రబాబు చేసిందేంటి, అక్కడ బాహుబలి సెట్టింగులు తప్ప ఏమైనా ఉన్నాయా. వాన గట్టిగా వస్తే సచివాలయం గదుల్లోకి నీళ్ళు వస్తాయి. అసెంబ్లీ చాంబర్లు కూడా వానలో తడిసిపోతాయి. పై నుంచి ఏకంగా నీరు ప్రతిపక్ష నేత చాంబర్లకే వస్తుంది. తాత్కాలిక  భవనాలు పేరు చెప్పి కట్టినవి అలా ఉన్నాయి మరి. అటువంటిది  అమరావతి రాజధాని అయిపోయిందని బాబు అంటే అంతకంటే పెద్ద జోక్ ఉండదేమో


ఇక అమరావతి రాజధానిని తరలిస్తున్నారంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. అమరావతి కోసం ఎందాకైనా అంటూ ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. వరదలు వస్తాయని సాకు చెప్పి తరలిస్తారా అంటూ గుస్సా అవుతున్నారు. అసలు అక్కడ రాజధాని ఉంటే కదా తరలించడానికి బాబూ అంటున్నారు వైసీపీ మంత్రులు. 


పైగా నిన్ననే క్రిష్ణా నది వరద వచ్చి ఎంతలా బీభత్సం జరిగిందో చూశాక కూడా బాబు ఇలా మాట్లాడ‌డం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ బొత్స అన్నది రాజధాని తరలిస్తామని కాదు, అమరావతి నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ జీవన వ్యయం కూడా చాలా అవుతుందని మాత్రమే. దానికే బాబు ఇలా అయిపోతే ఎలా మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: