Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 12:51 pm IST

Menu &Sections

Search

సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!

సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
సక్సెస్ స్టోరీ : అతని పట్టుదల ముందు అంధత్వం చిత్తుగా ఓడిపోయింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా గుర్తుంది కదా..ఈ మూవీలో హీరో చిన్ననాటి నుంచి అంధుడు..కానీ వాళ్ల అమ్మ నటి రాధిక మాత్రం తన కొడుకును అంధుడు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుకు రానివ్వకుండా అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చి మంచి వారియర్ గా చేస్తుంది. ఈ మూవిలో ఉన్న హైలెట్ డైలాగ్ ‘ ఐ యామ్ బ్లైండ్..బట్ ఐ యామ్ ట్రైన్డ్’  ఇది సినిమాల్లో చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తుంటాయి.. కానీ ఇదే నిజజీవితంలో జరిగితే.. అవును పుట్టుకతోనే అంధుడైనప్పటికీ అతని కృషీ, పట్టుదల, కార్యదీక్ష ప్రస్తుతం ఐఏఎస్ ని చేసింది.  కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు అన్న దానికి అచ్చమైన ఉదాహారణ ఆ యువకుడు. 

అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది సత్యం. కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన, సంకల్పం ఉంటే చాలు అని నిరూపించాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరా అనకుంటున్నారా..తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక్టర్‌గా ముస్సోరీలో శిక్షణకు ఎంపికయ్యారు. గూడపల్లి గ్రామంలోని కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఆయన జన్మించారు.  ఆ దంపతులకు  వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం.. నలుగురు కుమారులు, ఒక కుమార్తె దుర్గ. పెద్దకుటుంబం కావడంతో వీరికి కుటుంబ కష్టాలు చాలా ఉండేవి. గోనె సంచలు వ్యాపారం చేస్తూ బతుకు సాగిస్తున్న ఈ కుటుంబంలో ఒక ఆణిముత్యం ఉందన్న విషయం అప్పుడు గమనించలేదు.

ఎలాగో అల ఆ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే  నాలుగో సంతానం అయిన సింహాచలం పుట్టుక తోనే అంధుడు కావడం తండ్రికి కుమారుడిని చదివించే  స్తోమత లేదు. అంత పేదరికంలో ఉన్నా కూడా సింహాచలం లో చదువుకోవాలనే పట్టుదల బాగా ఉండేది.  ఆ పేదరికంతోనే సింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్‌లో చదువుతూ మలికిపురం ఎంవీఎన్‌ జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్‌ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు. తాను డిగ్రీ పూర్తి చేశాను అన్న సంతోషాన్ని తన తండ్రితో పంచుకుందామనుకున్న సింహాచలం కి ఓ చేదు వార్త వినిపించింది. 

తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలియంతో ఎంతో కుంగిపోయారు..అన్ని కష్టాలు పడి తన తండ్రి తాను ఓ మంచి పొజీషన్లోకి వస్తే చూసి సంతోషపడతాని అనుకున్న సింమాచలం కి నిరాశే మిగిలింది.  దీంతో కుటుంబానికి తాను భారం కాకూడదనుకున్న అతను ఐఏఎస్ కావాలని సంకల్పించుకున్నాడు ఆ క్రమంలోనే బీఈడీ కూడా చదివి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచరు ఉద్యోగం లో చేరారు. పట్టుదల తో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం మొదలు పెట్టాడు సింహాచలం. 

2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు. కలెక్టర్‌ అయ్యే అవకాశం కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు. 2016లో ఐఆర్‌ఎస్‌లో రాణించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఎట్టకేలకు 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు.  ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. 


సింహాచలం ఐఏఎస్ మాటల్లో.. మనిషికి అంగవైకల్యం ఉండొచ్చు..కానీ మనసుకు కాదు.  తాము అందరితో పోటీ పడలేము అన్న బాధకన్నా తామే అందరికీ పోటీ కావాలన్న కసి, పట్టుదల వారిలో ఉంటే ఏదైనా సాధించవొచ్చు.  అంగవైకల్యంతో ఉన్న ఎంతో మంది ఎన్నో అద్భుతాలు సృష్టించారు. నాకు ఉన్న ఆర్థిక పరిస్థితులు, కష్టాలు అందులోనూ నేను అంధుడిని అన్న విషయం గురించి ఆలోచించి ఉంటే..నా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది.  కానీ నేను అలా ఆలోచించలేదు..చదవాలి అందరితో పోటీ పడి మంచి ప్రయోజకుడిని కావాలి..నా కుటుంబాన్ని ఆదుకోవాలి, రక్షణగా ఉండాలనే పట్టుదల నాకు చిన్ననాడే కలిగింది. అందుకు అందరూ నాకు సహకరించారు..నన్ను ఈ స్థానానికి తీసుకు వచ్చారని ఎంతో నిడారంబరంగా చెప్పారు. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్