స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ పాడుకునే రోజులు పోయాయి.స్నేహమేరా స్వార్దం స్నేహమేరా నమ్మక ద్రోహం అంటుపాడుకునే రోజులొచ్చాయి.కాకపోతే ఏంటండి ఎవడితో పడితే వాడితో స్నేహం చేయడం,చివరకు అదిచేసాడు ఇది చేసాడంటుస్టేషన్ మెట్లు ఎక్కడం.చాలకామన్ అయ్యింది ఈరోజుల్లో.తల్లిదండ్రులు వద్దన్న పనిచేస్తారు వారిమాట పెడ చెవిన పెట్టి ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తారు చివరకు సమస్య వచ్చినప్పుడు గగ్గోలు పెడుతూ ఏడుస్తారు.ఇలాంటి సంఘటనే, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.స్నేహం పేరుతో యువతికి దగ్గరై,ఆమె నగ్న ఫొటోలు పంపాలని వేధిస్తున్న యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.




పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్‌ జిల్లాకి చెందిన మహమ్మద్ రయానుద్దీన్ అనే యువకుడు శంకర్‌పల్లిలోని ఓ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ బీఏ చదువుతున్నాడట. కొద్ది రోజుల కిందట తన క్లాస్‌మెట్ అయిన ఓ యువతి(19)తో పరిచయం పెంచుకుని స్నేహం పేరుతో ఆ యువతికి దగ్గరై ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ ఏకాంతంగా ఉన్న సమయంలో సెల్ఫీలు తీసుకున్నాడు.ఎప్పుడైతే ఆ యువతి పిక్స్ అతనిచేతిలో పడ్డాయో అప్పటినుండి తనతో సినిమాలు,షికార్లకు రావాలని,తనకు నచ్చినట్లే నడుచుకోవాలని వేధించడం ప్రారంభించాడట.




దీంతో ఆ యువతి అతడికి దూరంగా మెలగడంతో గతంలో తీసుకున్న ఫొటోలతో బ్లాక్‌మొయిల్‌ చేయడం మొదలు పెట్టాడట, అంతే కాకుండా తన నగ్న చిత్రాలను పంపించాలని తీవ్రంగా వేధింపులకు గురివేస్తూ తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె తల్లిదండ్రులకుచేరవేస్తానని బెదిరించాడట.ఇటీవల యువతి తన తల్లిదండ్రులతో కలిసి సినిమాకివెళ్లిన సందర్భం లో  బాత్రూంకి వెళ్లి,నగ్న ఫొటోలు తీసి పంపాలని బలవంతం చేశాడు.దీంతో భయపడిన యువతి కొన్ని ఫొటోలు తీసి, వాట్సాప్ ద్వారా రయానుద్ధీన్‌కి పంపించింది.అయినప్పటికీ రయానుద్దీన్ వేధింపులు ఆగడంలేదు.దీంతో విసుగు చెందిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేయడంతో పాటు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసి,విచారణ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: