విద్యుత్ ధరలు  తగ్గింది మోదీ వల్లే

 తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ధరలు తగ్గడానికి  ముఖ్య కారణం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అని  తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ  కె లక్ష్మణ్ అన్నారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉత్తర దక్షిణ లను అనుసంధానం చేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని,  ఇది వేరొకరి గొప్ప తనం కాదని శ్రీ కే లక్ష్మణ్ చెప్పారు.

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తు  అన్న మాటను పట్టించుకోవడంలేదని, సౌర విద్యుత్తు సృష్టించడం ద్వారా  తక్కువ ఖర్చు తో విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని, దీని ద్వారా వినియోగదారులకు కూడా చాలా మేలు జరుగుతుందని శ్రీ కే లక్ష్మణ్ తెలిపారు.  ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సౌర విద్యుత్తును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన ఆవేశంగా అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి కావలసిన సదుపాయాలు కూడా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయిందని  శ్రీ కే లక్ష్మణ్ వాపోయారు. తక్షణమే ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు పరిస్థితి చూస్తే దేశంలో ప్రతి మారుమూల పల్లెలకు  విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత వహించిన ఈ సందర్భంగా శ్రీ కే లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. మనదేశంలో ప్రతి పల్లెలోనూ విద్యుత్ వెలుగులు నింపిన ఘనత  తప్పనిసరిగా భాజపాదే అవుతుందని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: