టీడీపీ పార్టీ ప్రతి పక్షంలోకి వచ్చిన తరువాత ఆపార్టీ మీద సింపతీ పెరుగుతుందని.. తిరిగి కోలుకుంటుందని చాలా మంది ఆశించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ పార్టీ ఇంకా ఘోరంగా తయారవుతుందా అని సందేహాలు వస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి పనులు, ఇంకా చెప్పాలంటే చెండాలమైన పనులు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. దీనితో ఆ పార్టీకి సింపతీ రాక పోగా ప్రజల్లో ఆ పార్టీ పట్ల అసహ్యం వేస్తుంది. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు.


నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు.


దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని బయటికి వస్తున్న టీడీపీ చెండాలపు పనులు ఉదాహరణకు .. కోడెల ఫర్నిచర్ భాగోతం .. తిరుమల టికెట్లపై అన్యమత ప్రచారం ఇవన్నీ టీడీపీ పార్టీ మీద ఇంకా వ్యతిరేకతను ఎక్కువ చేసేవే .. ఇక రాజధాని స్కాములు .. ప్రజావేదిక అక్రమ కట్టడం వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ ప్రజలకు తెలిసి పోయినాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: