వైఎస్ జగన్ పై సోమిరెడ్డి త్రీవ స్దాయిలో విరుచుకు పడుతున్నాడు..నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా కనిపించకూడదనే ఉద్దేశ్యంతోనే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన..వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిం చారు.నేడు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పచి,మేము కనుసైగ చేస్తే ప్రజల జీవితం సాగాలి,లేకుంటే ఆగిపోవాలనే విధంగా సీఎం జగన్‌ వింత ధోరణితో ముందుకు సాగుతున్నారని ఆయన ఆరోపించారు జరిగే అభివృద్ధి మొత్తం తన కనుసన్నల్లో ఉండే లా మొండిగా జగన్ వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.



ఈ సందర్బంగా పలువిషయాలను గుర్తుకు చేస్తూ,గతంలో వైఎస్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు మరింతగా ముందుకు తీసుకెళ్లారని,కాని ఇప్పుడు జగన్,చంద్రబాబు పథకాలను ప్రవేశపెట్టారనే కారణంగా నిలిపివేశారని ఆరోపించారు.చంద్రబాబు సీయం గా వున్న సమయంలో గ్రోత్‌రేట్‌లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని.రైతులు అమరావతి కోసం 33వేల ఎక రాలను ఇస్తే అన్నీ పనులు నిలిపివేశారు.ప్రభుత్వం నిర్ణయం కారణంగా రాజధాని ప్రజలు అయోమయంలో పడ్డారని పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనే పేరుతో కాంటాక్ట్ రద్దు చేయడం దుర్మార్గమని ఆరోపించారు.



ఇంకా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎన్నో ఈ ప్రభుత్వం తీసుకొంటుందని,సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని ఈ విషయంలో  ఓసారి ఈ ప్రభుత్వానికి హైకోర్టు కూడా  అక్షింతలు వేసిందని .ప్రజలందరు జగన్ రావాలి..జగన్ కావాలి అంటే, ఆయన వచ్చాక ఇప్పుడు అన్నీ కూల్చాలి, అందరినీ తిట్టాలి’ అనేలా పాలన సాగిస్తున్నాడని,సోమిరెడ్డి తెలిపారు.జగన్ తన తీరు మార్చుకుని రైతులకు,ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా కేంద్రం వెంటనే స్పందించి పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలని,మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని పూర్తిచేయాలని,"రాజధాని నిర్మాణాన్ని ఆపొద్దని,డిమాండ్ చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: