Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 5:51 am IST

Menu &Sections

Search

జగన్ సర్కార్ 70 రోజుల పాలన... ? మేము రంగంలోకి దిగితే...!!

జగన్ సర్కార్ 70 రోజుల పాలన... ?  మేము రంగంలోకి దిగితే...!!
జగన్ సర్కార్ 70 రోజుల పాలన... ? మేము రంగంలోకి దిగితే...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో వైఎస్ జగన్ 70 రోజుల పాలనపై భిన్న వాదనలు ఉన్నాయి. బాగుందని కొందరు అంటే దశా దిశా లేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలనపీ ఏకగ్రీవ అభిప్రాయం మాత్రం లేదు. అయితే పాలన ఇంకా మొదలు కాలేదని వైసీపీ నేతలు ఓ వైపు చెబుతూంటే తొలి రెండు రీళ్ళు  సిన్మా చూసి ఫ్లాప్ అనేస్తున్న వారు మరికొందరు.


ఈ జాబితాలో టీడీపీ పక్కన బీజేపీ కూడా నిలిచింది. బీజేపీకి జగన్ పరిపాలన అసలు నచ్చడంలేదుట. జగన్ పాలనలో జనం నానా అవస్థలు పడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. పాలించడంలో తడబాట్లు ఉన్నాయని, పొరపాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాలన చూసిన తరువాత కట్టు బట్టలతో జనం పొట్ట చేత పెట్టుకుని వలసలకు పోతున్నారని కూడా బీజేపీ నేత రాం మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు.


జగన్ పరిపాలన ఇదే తీరుగా కొనసాగితే మాత్రం బీజేపీ డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుందని ఆయన హెచ్చరించారు. మేము కనుక బరిలోకి దిగితే ఆ కధే వేరుగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీకి తామే అసలైన ఆల్టర్నేషన్ అని కూడా ఆయన అన్నారు. బీజేపీని తక్కువ అంచనా వేస్తే రానున్న రోజులో తమ పార్టీ అంటే ఏంటో చెబుతాయని కూడా ఆయన అన్నారు.


ఇదిలా ఉండగా టీడీపీ కంటే దూకుడుగా బీజేపీ జగన్ని విమర్శిస్తోంది. అసలు టైం కూడా ఇవ్వమని గట్టిగా చెప్పేస్తోంది. మేము రంగంలోకి దిగుతాము అంటూ రాం మాధవ్ చేసిన హెచ్చరికలో ఎన్నో అర్ధాలు ఉన్నాయని కూడా రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటికే జగన్ని అన్ని విధాలుగా ఇబ్బందిపాలు చేస్తున్న బేజేపీ నాయకులు దైరెక్ట్ అటాక్ అంటే మరెన్ని షాక్ ట్రీట్మెంట్లు ఇస్తారోనని కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి జగన్ ది ఫ్లాప్ షో అనేసిన బీజేపీ మరి తరువాత కదపబోయే పావులు ఏంటి అన్నది పొలిటికల్ సర్కిళ్ళలో ఆసక్తిగా ఉంది.


jagan,-bjp-ram-madhav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీకి బాబు మార్క్ రీచార్జ్ ...!
బాబుని నమ్మని బీజేపీ..!!
నయన్.. కళ్లకు ఏమైంది...!!
టీడీపీ కంచుకోటలో వైసీపీ దూకుడు...!!
కోడెల ఎపిసోడ్... టీడీపీ భరోసా దక్కలేదా...!!
జూనియర్ నమ్మి చాన్స్ ఇస్తే...!!
కోడెల కోరిక తీర్చని బాబు...!?
హాటీ ఇమేజ్ కంటిన్యూ..!
తమ్ముళ్ళ రియల్ కోరలు పీకడం కోసమేనా..!!
జగన్ మంత్రులు హిట్టేనా...!?
పల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు...!?
కోడెల ఆత్మహత్యపై కుమార్తె రియాక్షన్ ఇది...!!
రాశీఖన్నా హిమాలయాలకు ఎందుకెళ్ళింది..?
పాపికొండలు పిలుస్తున్నాయా.. !
కనిపిస్తే చాలు.. కడుపు నొప్పేనా..!!
అమరావతి రాజధానిపై కేసీయార్ షాకింగ్ కామెంట్స్...!!
తన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో చెప్పిన అమల !!
బాబులో తొలిసారి వణుకు పుట్టిందిగా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.