కోడెల శివ ప్రసాద్ వల్ల ఇప్పుడు టీడీపీ పార్టీకి ఎక్కడ లేని చెడ్డ పేరు వస్తుంది. తన కుటుంబం పరువు కూడా బజారున పడిన పరిస్థితి. పదవిలో ఉన్నప్పుడు అత్యాశతో అడ్డమైన గడ్డి తిన్నాడు. ఇప్పుడు కోడెల పాపం పండిందని చెప్పాలి. అయితే కోడెల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికే టీడీపీ గ్రహించింది. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీకి ఉన్న పరువును కాపాడుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే పోలీసులు అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు నమోదు చేసారు. సెక్షన్ 409 కింద .. సెక్షన్ 414 కింద కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 414 అంటే ఏదైనా ప్రొపెర్టీని దొంగతనం చేస్తే ఈ సెక్షన్ కేసు నమోదు అవుతుంది. చివరికి మాజీ స్పీకర్ కోడెల ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు. 


అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు కోడెల గురించి ఫర్నిచర్ దొంగతనం బయటికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో !


అయితే ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా జరిగి ఉండదు. చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదంటే .. బాబు గారికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అందుకే టీడీపీ కనీ వినీ ఎరుగని రీతిలో ఓటమి పాలైంది. బాబు గారికి ఇన్ని కనిపిస్తున్న మళ్ళీ ప్రజల దగ్దరికి వచ్చి నేనేం తప్పు చేసానో చెప్పండి అంటుంటే వీళ్ళను ఏమనాలో అర్ధం కావటం లేదు. అయితే కోడెల దొంగతనం చేసిన ఫర్నిచర్ విలువ సుమారు 65 లక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: