ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతమైన తుమ్మడిహెట్టి పర్యటనకు కాంగ్రెస్ నేతల బృందం బయలుదేరింది . క్షేత్రస్థాయిలో తుమ్మడిహెట్టి ప్రాజెక్టును పరిశీలించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ బృందం సికింద్రాబాద్ నుంచి రైల్లో తుమ్మడిహెట్టి పర్యటనకు పయనమయ్యారు . తమ హయాంలో డిజైన్ చేసిన ప్రాజెక్టు కాకుండా టీఆర్ ఎస్ ప్రభుత్వం డిజైన్ మార్చి నిర్మించడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు .


తుమ్మడిహెట్టి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలోనే జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు . రాష్ట్రం ఏర్పడ్డాక డిజైన్ మార్చి నిర్మించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . తుమ్మడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల వరకు నీటిని తీసుకెళ్లాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది . రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును మార్చి టీఆర్ ఎస్ సర్కారు అంచనాలను పెంచిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు .


గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ను వదిలేసి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించడంలో ఆంతర్యం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు . ప్రభుత్వం పై ఒత్తడి తీసుకు వచ్చే క్రమంలో తుమ్మడిహట్టి ప్రాంతాన్ని సందర్శిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు . అయితే కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి స్థలంలో నీరు తక్కువగా అందుబాటులో ఉందని టిఆర్ ఎస్ వాదిస్తోంది .



మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి అధికంగా నీటిని తరలిస్తున్నట్లు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు . కాంగ్రెస్ నేతలు ఎటువంటి అంశాలను క్లియర్ చేయనున్నారో, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియటం కోసం వేచి చూడాల్సి ఉంది .


మరింత సమాచారం తెలుసుకోండి: