శ్రీశైలం ఆలయంలో అన్యమతస్తుల కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఆలయంలో ఇతర మతాలకు చెందిన ఉద్యోగుల వ్యవహారంపై అధికారులు నివేదికను సిద్ధం చేశారు. దేవస్థానంలో మొత్తం ముగ్గురు పర్మినెంట్, పధ్నాలుగు మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇతర మతస్థులని తెలుస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పది మంది అన్య మతస్థులకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమీషనర్ పద్మకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదికను సమర్పించారు.


పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దశల వారీగా ఇతర మతస్తులకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినట్టు నివేదికలో తెలియజేశారు. వీరిలో అత్యధికంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు మధ్యనే నియమితులయ్యారు. ఇటీవల దేవస్థానాల్లో అన్యమతస్తులకు షాపుల కేటాయింపుపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వివాదం కారణంగా దుకాణాల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కారణంగానే మొత్తం దేవస్థానంలో ఇతర మతాలకు చెందిన ఉద్యోగుల వివరాలపై నివేదిక తయారు చేశారు.


మొత్తం పదిహేడు మంది అన్యమతస్థులు ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానంలో పని చేస్తున్నారని తెలుస్తుంది. అందులో ముగ్గురు పర్మినెంట్ ఉద్యోగుల కాగా మిగిలిన వారు కాంట్రాక్టు పద్ధతిలో స్వామి వారి ఆలయంలో ఉద్యోగస్తులుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలుస్తుంది. అన్యమతస్తుల కొలువుపై భక్తులు మండిపడుతున్నారు. ఇటీవలే షాపులు అన్యమతస్తులకు కేటాయిస్తున్నారన్న వార్త బయటకు పొక్కిన తర్వాత హిందూ సంఘాలు ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించాయి.


హైదరాబాద్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం శ్రీశైలం వెళ్లి అక్కడ ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో గవర్నమెంట్ ఆ కాంట్రాక్టు రద్దు చేసింది. ఆ నియామక ప్రక్రియను నిలిపేసింది. అప్పుడు అన్యమతస్థులు సైతం శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారన్నారన్న విషయం తెలుసుకున్న ఈవో వివరాల్ని ఒక నివేదికలో పొందుపరిచి దేవాదాయ శాఖకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: