ఆ నగరంలో అవి ఇరుకైన కాలనీలు, స్థలం లేక రోడ్డుపైనే కారు, టూ వీలర్ పార్కింగ్. అయితే అర్ధ రాత్రి ఒక్క సారిగా ఆ వెహికల్స్ నుంచి మంటలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పార్కింగ్ చేసిన వెహికల్స్ ఎలా తగలబడుతున్నాయి. ఎవరైనా కావాలనే కాల్చేస్తున్నారా లేదా వాటికవే తగలబడి పోతున్నాయా? పార్కింగ్ వాహనాలనూ ఎందుకు కాలుస్తున్నారు.  వెహికిల్స్ మంటలు వెనుక స్కెచ్ ఏమిటి? మీకు కారుగాని, టూవీలర్ గాని ఉందా, వాటిని ఇంటి బయట పార్క్ చేస్తున్నారా అయితే జాగ్రత్త అకస్మాత్తుగా మీ వాహనాలు తగలబడే అవకాశముంది. లేదంటే రాత్రికి రాత్రే మీ వాహనాలు మాయం అవుతాయి. ఆ వాహనాల మంటల వెలుక స్కెచ్ ఏంటో తెలుసుకోండి.


ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో పార్కింగ్ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో స్థలం లేక ఇంటి ముందు కారు, టూ వీలర్ పార్కింగ్ చేస్తే అర్ధరాత్రైతే చాలు వాహనాల్లో మంటలు ఎగిసిపడి కాలి బూడిదవుతున్నాయి. విజయవాడలో వాహనాల పరిస్థితి ఇది. రాత్రయితే చాలు వాహనాలు తగలబడి పోతుంటే ఇంటి బయట పార్కింగ్ చేయడానికి జనం భయపడిపోతున్నారు. ఓ వైపు పార్కింగ్ చేసిన వాహనాలను దొంగలు ఎత్తుకెళుతుంటే, మరోవైపు ఆకస్మాత్తుగా వాహనాల్లో చెలరేగుతున్న మంటలు దడ పుట్టిస్తున్నాయి. దీంతో ఆ మంటల నుంచి తమ వెహికల్స్ ను కాపాడండి అంటూ వాహన ధారులు పోలీస్ స్టేషను ముందు క్యూ కట్టారు. ఎవరైనా కావాలనే కాల్చేస్తున్నారా లేక వాటికవే తగలబడి పోతున్నాయా అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు.


ఈ క్రమంలోనే చివరకు రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ముఠాలు చెప్పిన నిజాలు విని నిర్ఘాంతపోయారు పోలీసులు. ఓ వైపు వెహికల్స్ దొంగతనం మరోవైపు వాహనాల మంటలు వెనుకున్న స్కెచ్ విని షాక్ కు గురయ్యారు. వాహనాలకు నిప్పంటించడం వాహనాల్ని కొట్టేయడం ఇవన్నీ కూడా ఆ రెండు ముఠాల స్కెచ్ లో భాగమే. ఇప్పటికే వీరి స్కెచ్ లో పడి ఎంతో మంది వాహనాలు కాలి బూడిదయ్యాయి. వాహనాల్లో మంటలు, వాహనాల చోరీ ఇలా రెండు వైపులా వాహన దారుల ఇళ్లు గుల్ల అవుతోంది. దీని పై సీరియస్ గా దృష్టి పెట్టిన విజయవాడ పోలీసులు రెండు ముటాలను అరెస్ట్ చేశారు. వాహనం నచ్చితే దొంగతనం, లేదంటే వాటికి నిప్పు పెట్టడం వీళ్ళ యాక్టివిటీ అని తెలుసుకొని పోలీసులు షాక్ కు గురయ్యారు.


తాతా ప్రసాద్ అలియాస్ మామిళ్లపల్లి శశిధర్ ఇతడు పార్క్ చేసిన కార్లను మాయం చేయడంలో సిద్ధహస్తుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది కార్లను దొంగతనం చేశాడు. రోడ్డు పక్కన నిలిపివుంచిన కార్లను దొంగతనం చేయడంలో ఆరితేరాడు. కార్లను దొంగతనం చేయడానికి ముందు తాతా ప్రసాద్ చెన్నై లోని బీఎండబ్ల్యూ కారు షోరూంలో మెకానిక్ గా పనిచేశాడు. ఎక్కడ నొక్కితే ఏమి ఓపెన్ అవుతుందో అతనికి బాగా తెలుసు. జల్సాలకు అలవాటు పడిన తాతాప్రసా మొదట ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రతిసారి దొంగతనం చేసి పట్టుబడటం, జైలుకు వెళ్లి రావడం ఎందుకు అనుకున్నాడో ఏమో ఆఖరు దొంగతనం ఒకటి పెద్దగా చేసి ఇక జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు.


ఇందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. జైలులో తనకు పరిచయమైన విజయవాడకు చెందిన నాగరాజు తమిళనాడుకు చెందిన పెరియస్వామితో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. రోడ్డు పక్కన ఇంటి ముందు పార్క్ చేసిన కార్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తన గ్యాంగ్ తో కారులో పగలు రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ కారులో ఇంటి ముందు నిలిచి ఉంటాయో గుర్తించి అర్దరాత్రి దొంగతనానికి స్కెచ్ వేసేవాడు. ఎక్కడ కారు కొట్టేయాలి అనుకున్నాడో అక్కడకు తన గ్యాంగ్ తో కారులో వచ్చి తాతా ప్రసాద్ ఒక్కడే కిందకు దిగుతాడు. మిగిలిన వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత తాతా ప్రసాద్ సైలెంట్ గా కారు డోరు అద్దం పగలగొట్టి కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతాడు.


ఇలా పది కార్లు దొంగతనం చేసిన తాతాప్రసాద్ వీటన్నిటిని ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అనుమానం రాకుండా ఉండేందుకు గాను ఒక్కొక్క కారు ఒక్కొక్క చోట పార్కింగ్ చేసి ఉంచుతాడు. కొట్టేసిన కార్లతో తాతా ప్రసాద్ ఏం చేయాలనుకుంటున్నాడో తెలిసిన పోలీసులు షాకయ్యారు. దొంగతనం చేసిన కార్లతో నెంబరు ప్లేటు మార్చి చెన్నైలో ఏకంగా కారు ట్రావెల్స్ పెట్టాలనుకున్నాడు. ఇంకొక కారు దొంగతనం చేసి చెన్నై చెక్కేయాలి అనుకున్న తాతాప్రసాద్ ఎట్టకేలకు బెజవాడ పోలీసులకు పట్టుబడ్డాడు.


నిందితుడు తాతా ప్రసాద్ కార్ల చోరీ ఐడియా తెలుసుకున్న పోలీసులే ఆశ్చర్యపోయారు. దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు నగర శివార్లలో ఉన్న చెక్ పోస్ట్ లను, టోల్గేట్ లను అప్రమత్తం చేస్తారు. అందుకే తాతా ప్రసాద్ చోరీ చేసిన కార్లను వెంటనే చెన్నైకి తరలించకుండా ఇబ్రహీంపట్నం కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో దాచిపెట్టేవాడు. పోలీసుల నిఘా కాస్త తగ్గాక చెన్నై వైపు వెళ్లే కాజ టోల్ ప్లాజా మీదుగా కాకుండా తెనాలి నుంచి ప్రకాశం జిల్లా వెళ్ళి అక్కడి నుంచి చెన్నై పారిపోవాలని అనుకున్నాడు. కానీ చివరకు తాతా ప్రసాద్ తో పాటు మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. మరోవైపు పార్కింగ్ చేసిన కారులను తగలబెడుతున్న గ్యాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


అయితే వాహనాలను ఎందుకు తగలబెడుతున్నారో వాళ్లు చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయారు పోలీసులు. ఫైనాన్స్ వారు వాళ్ళ వాహనాలను డబ్బు కట్టని కారణంగా తీసుకెళ్ళడంతో మనస్తాపానికి గురై వేరే వాళ్ళ వాహనాలను కూడా తగలబెట్టాలని అని సమధానం ఇచ్చారు. చివరకు బెజవాడలో వరుస కారు దొంగతనాలు వాహనాలకు నిప్పు అంట్టిస్తున్న రెండు ముఠాలను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదేమైనా వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా పక్కగా లాక్స్ వేసి సెక్యూరిటీ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు పోలీసులు.




మరింత సమాచారం తెలుసుకోండి: