కర్ణాటకలో కాంగ్రెస్  జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడి పోవటంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది గాని పార్టీ నేతలకు క్యాబినెట్ బెర్తులను కేటాయించే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మంది ఆశావాహుకులు ఉండటంతో మంత్రి వర్గ కూర్పు సవాలుగా మారింది. అందుకే ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులకు ఇచ్చి అసంతృప్తిని తగ్గించాలని బీజేపీ భావిస్తుంది. ఏపీలో జగన్ కు భారీ మెజారిటీ ఉన్న ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. 


బీజేపీలో ఇప్పటీకే మంత్రి వర్గంలో చోటు దక్కని వారు చాలా అసంతృప్తితో రగిలి పోతున్నారంటా ..  ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి.


అయితే మంత్రి వర్గ సమయంలో సుమారు 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని సమాచారం వచ్చిందంటా .. దీనితో మంత్రి వర్గ పూర్తి స్థాయి విస్తరణ బీజేపీకి కత్తి మీద సాము లాగా తయారైందటా .. ఇదే విధంగా కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవటంతో ఇప్పుడు బీజేపీ వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే కొన్ని ఖాళీలను మంత్రి వర్గంలో అలానే ఉంచింది. దీనితో మిగతా వారిని సంతృప్తి పరిచే పనిలో పడ్డారు బీజేపీ సీఎం. 

మరింత సమాచారం తెలుసుకోండి: