పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. జమ్ముకశ్మీర్ అంశంలో భారత్, పాక్ మధ్య మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఎలాంటి ఆస్కారం లేదని ప్రధాని నరేంద్రమోదీ మ‌రోమారు తేల్చిచెప్పారు. ఇరుదేశాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలవని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. మోదీ, ఇమ్రాన్‌ఖాన్ తనకు మంచి మిత్రులని, కశ్మీర్ వివాదాన్ని వారు పరిష్కరించుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. త‌ద్వారా మోదీ అంత‌ర్జాతీయ వేదిక‌గా చెక్ పెట్టేశారు.


జీ7 కూటమిలో భారత్ భాగస్వామి కాకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై నిర్వహించిన సదస్సులో మోదీ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలను తొలిగించేందుకు భారత్ డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తున్నదని చెప్పారు. ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ట్రంప్ కూడా మోదీతోపాటు ఉన్నారు. జీ7 సదస్సు సందర్భంగా పర్యావరణ అంశంపై నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలన, నీటి సంరక్షణ, సౌరశక్తి ఉత్పాదకత పెంపు, జీవజాలం, జంతుజాలం సంరక్షణకు భారత్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరువురు నేతల భేటీ ముగిసిన అనంతరం విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా నుంచి దిగుమతులను పెంచనున్నట్లు ట్రంప్‌తో ప్రధాని పేర్కొన్నారన్నారు. అలాగే వాణిజ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు త్వరలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారని చెప్పారు.

ఇదిలాఉండ‌గా,అమెజాన్ కార్చిచ్చు, వాణిజ్య యుద్ధం, ఇరాన్ అంశంతోపాటు ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు సాగించిన జీ7 సదస్సు సోమవారం ముగిసింది. అయితే వివిధ అంశాల్లో సభ్యదేశాల మధ్య ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్‌కు పయనమైన ప్రధాని మోదీఫ్రాన్స్‌లో జీ-7 సదస్సును ముగించుకుని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం భారత్‌కు పయనమయ్యారు. జీ-7 సదస్సు సందర్భంగా ట్రంప్ సహా వివిధ దేశాధినేతలతో ఆయన సమావేశమయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: