వేంకటేశ్వర స్వామి భక్తులను విస్మయానికి గురిచేసే ఘటన మరొకటి తిరుమలలో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి ఆభరణాలు కొన్ని మాయమైనట్లుగా తెలుస్తుంది. సాక్షాత్తు ట్రెజరీలో ఉన్న బంగారం, వెండి వస్తువులు కనిపించకపోవడంపై టీటీడీ ఎఈవోపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పోయిన ఆభరణాలకు సంబంధించి సొత్తు రికవరీ చేసుకున్నారే తప్ప ఆభరణాలు ఏం పోయాయి ఇప్పటి వరకు విచారణ జరిపించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిటిడి ట్రెజరీలోనే తిరుమలేశుడి ఐదు కిలోల వెండి కిరీటం మాయమైంది.


దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా అదృశ్యమైనట్లుగా తెలుస్తుంది. దీనిపై ఆలస్యంగా మేల్కొన్న అధికారులు టిటిడి ఎఈవో శ్రీనివాసులపై చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసుకుని చేతులు దులిపేసుకున్నారు. అయితే స్వామి వారి ఆభరణాలు ఏమయ్యాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భద్రత కల్పించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. భక్తులు బ్రహ్మాండ కోటి నాయకుడిగా కొలిచే తిరుమల వేంకటేశ్వర స్వామి నగలు ఆభరణాలకే రక్షణ లేకపోవడంపై బిజెపి నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శ్రీవారి ప్రతిష్టకు కళంకం తెచ్చే విధంగా టీటీడీ ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నగల మాయం వెనుక అసలు కారకులెవరో పోయిన సొత్తుకు ఒక్కరినే బాధ్యుడ్ని చేసి ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడం ఏమిటని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. స్వామి వారి నగల మాయం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ట్రెజరీ నుంచి మాయమైనటువంటి ఐదు కేజీల నలభై గ్రాముల వెండి కిరీటంతో పాటు ఓ బంగారు హారము, రెండు బంగారు ఉంగరాలు మాయమైనట్టు అధికారులు గుర్తించారు.


అయితే ఇందుకు బాధ్యులను చేస్తూ టీటీడీ ట్రెజరీ ఏఈవో గా పని చేస్తున్న శ్రీనివాస్ కు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా గత ఏడాది గోవిందరాజస్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయమైన తర్వాత ఈ వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడం. దీంతో ఒక్కసారిగా భక్తులలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: