3000 మంది భ‌ద్ర‌త‌...కేవ‌లం న‌లుగురికే. మీరు చ‌దివింది నిజమే. కేవలం నలుగురికి దాదాపు 3వేలమందికిపైగా భద్రత కల్పిస్తున్నారు. అది కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ. అందులోనూ ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండోలతో అడ్వాన్స్‌డ్ వెపన్స్, వాహనాలు, గాడ్జెట్స్‌తో వీరంతా వీవీఐపీలకు భద్రత ఇస్తున్నారు.  ప్రధాని, మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు 3 వేలమంది సెక్యూరిటీ అంటే నమ్మలేరు.


ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకకు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కమాండోలు మూడువేలమందికిపైగా భద్రత క‌ల్పిస్తున్నారు. ఈ విషయంపై కేంద్రమే స్వయంగా స్పష్టత ఇచ్చిందట. ఓ జాతీయ మీడియా కథనం వెలువ‌రించింది. ఇంత‌కీ ఈ ఎస్పీజీ భ‌ద్ర‌త విష‌యంలో అనేక‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే....ఎస్పీజీ కమాండోలు కూడా చాలా ప్రొఫెషనల్‌గా, చురుకుగా వ్యవహరిస్తూ.. వీవీఐపీలకు భద్రతను కల్పిస్తున్నారు. ఈ సెక్యూరిటీ సిబ్బంది కేవలం సెక్యూరిటీని కల్పించడమే కాదు.. నేతలకు సంబంధించి ప్రతి కదలికను గమనిస్తూ.. నిఘా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా వీవీఐపీల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. నేతల పర్యటనల సమయంలో సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌తో.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.. వీవీఐపీలకు నీడలా వ్యవహరిస్తారు.


సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం వీవీఐపీలు  పర్యటనలకు వెళ్లే 24 గంటల ముందు ఎస్పీజీ కమాండోలు అక్కడ భద్రతను పర్యవేక్షిస్తారు. రాజకీయపరమైన ఏవైనా ర్యాలీలు, సభలు ఉంటే అక్కడి వేదికను తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. స్థానిక పోలీసుల సాయంతో భద్రతను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఈ భద్రతా విభాగంలో (ఎస్పీజీ) స్నైపర్స్, స్పాటర్స్, బాంబ్ డిస్పోజల్ ఎక్స్‌పర్ట్స్‌ ఉంటారు.


ఎస్పీజీ కమాండోలకు శిక్షణ కొనసాగుతూనే ఉంటుంది. వీరు అల్ట్రా మోడ్రన్ రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, స్పెషల్ గాగుల్స్, గ్లవ్స్, నీ పాడ్స్ ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు కాన్వాయ్‌లో అధునాతన సౌకర్యాలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉంటాయి. ఆర్మ్‌డ్ 7 సిరీస్ బీఎండబ్ల్యూ, ఆర్మ్‌డ్ రేంజ్ రోవర్స్, ఎస్‌యూవీ, టయోటా, టాటాలు ఉంటాయి. అలాగే పరిస్థితిని బట్టి ఐఏఎఫ్‌ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) సేవల్ని కూడా వినియోగించుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: