సీబీఐ ...  ఈడీ ఇప్పటి వరకు చాలా కేసులు డీల్ చేసి ఉండొచ్చు. కానీ చిదంబరం కేసు డీల్ చేయడం వీరికి అంత సులభమైన వ్యవహారం కాదని చెప్పాలి. ఎందుకంటే చిదంబరం స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్. కోర్టుకు ఏ సెక్షన్ చెప్పి తప్పించుకోవాలో తెలుసు. దర్యాప్తు సంస్తలను ఎలా డిఫెన్స్ లో పడేయాలో బాగా తెలుసు. ఇప్పుడు చిదంబరం కూడా అదే చేస్తున్నారు. చిదంబరంకు విదేశాల్లో .. ఆస్తులు సుమారు 17 బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయని ఈడీ వాదించింది. వెంటనే చిదంబరం ఈడీ వాటిని నిరూపించే దమ్ము ఉందా .. ? అలా నిరూపించగలిగితే బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ను బయట పెట్టమని ఈడికే ఝులకు ఇచ్చారు. దీనితో ఈడీ ఆత్మ రక్షణలో పడింది. 


కోర్టులో చిదంబరం స్టేట్మెంట్స్ చూస్తుంటే .. ఈ కేసులో సాక్షాధారాలు లేవని అర్ధం అవుతుంది.పదేళ్ల కింద చిదంబరం హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పటి గుజరాత్ హోమ్ మినిస్టర్ అమిత్ షాను   ఒక ఎన్కౌంటర్ కేసులో అరెస్ట్ చేపించారు. కానీ ఆ కేసులో సాక్షాధారాలు లేక అమిత్ షా బయటకి వచ్చాడు. ఇప్పుడు కూడా చిదంబరం అలానే బయటికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది రాజకీయ కక్షలో ఒక భాగం. అయితే చిదంబరం తరపున వాదిస్తున్న కపిల్ సిబాల్ కోర్టులో చాలా గట్టిగానే వాదిస్తున్నారు. ఈ కేసులో చిదంబరం డైరెక్ట్ ప్రమేయం ఉందని మీరు నిరూపిస్తే నేనే కేసును వదిలేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే దీని బట్టి చిదంబరం కేసులో సాక్షాధారాలు సీబీఐ సేకరించలేదని అర్ధం అవుతుంది.   


అయితే చిదంబరం అరెస్ట్ పట్ల ఎవరు కూడా జాలి చూపని పరిస్థితి. ఎందుకంటే ఎందుకంటే అధిరికంలో ఉన్నప్పుడు గర్వంతో ప్రత్యర్థులను ఇలానే జైలుకు పంపించారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించడంలో చిదంబరంకీలక పాత్ర పోషించాడని ఒక టాక్ కూడా ఉంది. సోనియా గాంధీని ఎదిరించినందుకు రాజకీయంగా జగన్ మీద కక్ష తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే చిదంబరంకు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే రోజు వచ్చింది. చెడపకురా.. చెడేవే అని పెద్దలు ఊరకనే అనలేదు. ఇలాంటి నీచమైన రాజకీయ నేతలు ఉంటారు కాబట్టే ఇటువంటి సామెతలు పుట్టాయి కాబోలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: