కర్ణాటకలో కాంగ్రెస్  జేడీస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమార స్వామీ ప్రతి రోజు తన భాదను వెళ్లగక్కేవారు. తనను కాంగ్రెస్ ఒక సీఎంగా చూడలేదని, క్లర్క్ మాదిరిగా పని చేశానని కుమార స్వామీ వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా పేరుకు సీఎం యెడ్యూరప్ప అయినప్పటికీ ప్రతి కీలక నిర్ణయం బీజేపీ అధిష్టానం నుంచి రావాల్సిన పరిస్థితి. దీనితో యెడ్యూరప్ప చాలా అసంతృప్తితో ఉన్నదంటా .. మొన్న ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో కూడా అమిత్ షా చెప్పిన పేర్లు మాత్రమే ఫైనల్ అయ్యాయి. యెడ్యూరప్ప కేవలం ప్రమాణ స్వీకారం ను మాత్రమే జరిపించారు. దీనితో కర్ణాటకలో కుమార స్వామీ పరిస్థితి .. యడ్యూరప్పకు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 


అయితే బీజేపీ ..  ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది గాని పార్టీ నేతలకు క్యాబినెట్ బెర్తులను కేటాయించే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మంది ఆశావాహుకులు ఉండటంతో మంత్రి వర్గ కూర్పు సవాలుగా మారింది. అందుకే ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులకు ఇచ్చి అసంతృప్తిని తగ్గించాలని బీజేపీ భావిస్తుంది. ఏపీలో జగన్ కు భారీ మెజారిటీ ఉన్న ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. 


బీజేపీలో ఇప్పటీకే మంత్రి వర్గంలో చోటు దక్కని వారు చాలా అసంతృప్తితో రగిలి పోతున్నారంటా ..  ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: