హరీష్ రావు ఈ పేరు ఒకప్పుడు రాజకీయాల్లో పెను సంచలనం.కేసీఆర్‌ తర్వాత అంతటి దమ్మున్న నాయకుడు..కేసీఆర్‌ తర్వాత తెలంగాణకు కాబోయే సీయం అని కార్యకర్తలు ఎన్నో ఊహించుకున్నారు.ఎప్పుడైతే కేటిఆర్ రాజకీయాల్లోకి వచ్చాడో అప్పటినుండి క్రమక్రమంగా హరీష్ కనుమరుగైపోయాడు.ఎంతలా అంటే ప్రస్తుతం వున్న పరిస్దితిలో  హరీష్ రావు అంటే ఎవరు అనేంతలా.ఏ కార్యక్రమంలో సరిగ్గా కనిపించడు.ఒకప్పుడు అన్ని తానై నడిపించిన పార్టీని,ఇప్పుడు తనకు తెలియనంతలా అంటి అంటనట్లుగా ఉంటున్నాడు.ఇలా వుండటానికి దీని వెనక పెద్ద చరిత్రే వుండి వుంటుందని లేకపోతే మామకు నచ్చిన అల్లుడు ఇంతలా దూరమవ్వ వలసిన అవసరం ఏముందని పార్టీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారట..




ఇకపోతే టీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా..కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం విస్తృతంగా జరిగింది.అయితే,ఈసారి విస్తరణలో ఆయనకు బెర్త్‌ ఖరారైతే అయినట్టు..లేకపోతే భవిష్యత్తులో ఉండబోదని తెలుస్తోంది.ఇక,హరీశ్‌రావుకు మళ్లీ కేబినెట్‌లో చోటు లభించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుత కేబినెట్‌లో కేసీఆర్‌,మంత్రి ఎర్రబెల్లిది వెలమ సామాజిక వర్గం.అదే సామాజిక వర్గానికి చెందిన వినోద్‌కుమార్‌ కేబినెట్‌ హోదాతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఇక కేటీఆర్‌నూ కేబినెట్‌లోకి తీసుకుంటే,వెలమ సామాజిక వర్గం వారి సంఖ్య నాలుగుకు చేరుతుంది.ఈ పరిస్థితుల్లో హరీశ్‌కు కేబినెట్‌ బెర్త్‌ అనుమానమేనని అంటున్నారు.. 




‘అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ అనేక పద్ధతుల్లో హరీశ్‌ ప్రాధాన్యాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ వస్తున్నారు.ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటకే ఆయనను పరిమితం చేయడంలో సఫలీకృతులయ్యారు.మళ్లీ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి,ప్రాధాన్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తారని ఊహించలేం.ఒకవేళ హరీశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే,కొన్ని నెలలుగా ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలకు విలువ లేదు,అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.ఇలాంటి పరిస్దితిలో హరీష్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో,లేదా రాబోయే రోజుల్లో ఏపార్టీలోకి మారుతారో అనే విషయం అర్దం కాకుండ వుందంటున్నారు హరీష్ సన్నిహితులు..

మరింత సమాచారం తెలుసుకోండి: