లోకేష్ తోడల్లుడి తండ్రికి ప్రభుత్వ భూములను కట్టబెట్టారన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్. అసలు ఆ భూమికి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కట్టలేదని ఇంకా ప్రభుత్వ ఆధీనంలో భూమి ఉంది అని స్పష్టం చేశారు. బొత్సా వ్యాఖ్యల వెనుక ఏవో దురుద్దేశాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు భరత్. దీనిపై భరత్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అపుడు మేము కిరణ్ కుమార్ రెడ్డి గారితో మేము ఎమోజీ సైన్ చేశామని, వాళ్ల క్యాబినెట్ వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాళ్ళే క్లియర్ చేసి మాకు కేటాయించారు అని భరత్ తెలిపారు.


అప్పుడు రేటు లక్ష అని ఆయనకి తెలుసని, ఈ ఐదేళ్ళలో ఏం జరిగిందో అతనికి తెలియకపోవచ్చని, మళ్ళి ఇప్పుడు అతను వచ్చారని, ఇప్పుడు అతను చూడవచ్చు కదా అతను కావాలి అంటే గవర్న్ మెంట్ రికార్డ్స్ లో ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని, అసలు ఏ రేటు మీద వాళ్ళు కేటాయించారనేది అని ప్రశ్నించారు భరత్. నాకంటే బాగా వాళ్ళకే తెలుసు కదా, తెలిసినప్పుడు కూడా ఇలా అంటున్నారంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు ఆలోచనైతే ఉంది అని అన్నారు భరత్. అసలు నేనే కారణమా లేకపోతే ఇంకేదో కారణం ఉందా అని, అతనికి తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే ఆయనని ఇంకెవరో మాట్లాడిపిస్తున్నారా, ఏంటి ఇది అని భరత్ ప్రశ్నించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: