ఆభరణాలు  గోవిందా….

కోరిన వారి కొంగు బంగారం, కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి  వారి దివ్య సన్నిధిలో ఆభరణాలు  మాయం అట. అనాధ రక్షకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  ఆభరణాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది.


తిరుమల శ్రీవారి ట్రెజరీ నుండి స్వామివారి ఆభరణాలు  మాయమైనట్లు కొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.   మాయమైన ఆభరణాలు ఏవి అన్నది కనీసం గుర్తించలేని పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ విభాగం ఉన్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ భాను ప్రకాష్ రెడ్డి  గారు తిరుపతి ఎస్పీ కు ఫిర్యాదు చేశారు.


శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిమ్మకు  నీరెత్తినట్లు ఉన్నదని, భక్తుల మనో భావాలు పై ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదన్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులెవరు ఈ విషయంపై స్పందించడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు. 


ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను త్వరగా పట్టుకోవాలని తిరుపతి అర్బన్ ఎస్పీని శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గారు అభ్యర్థించారు.


దొంగలను కాపాడే  ప్రయత్నంలో తితిదే  పెద్దలు ఉన్నారేమోనన్న అనుమానం కలుగుతున్నదని,  అందువల్లే తాము తిరుపతి అర్బన్ ఎస్పీ ను కలిసి నిజాలు  నీగ్గు తేల్చమని ఫిర్యాదు చేశామన్నారు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి.   స్వామివారి ఆభరణాలు మాయమైతే అంత బాధ్యతారాహిత్యం ఎందుకని తితిదే నీ  నిలదీసి అడిగారు. స్వామివారి అం ఆవరణలో విషయం తేల కుంటే ఒక మహోద్యమం  భక్తుల సహకారంతో చేపడతామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: