ఈ కాలంలో చాలమంది హోం ఫుడ్స్‌కంటే హోటల్ ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆఫీస్‌కు వెళ్లేసమయంలో టిఫిన్ అంటే హోటల్ అంటారు.లంచ్‌బాక్స్ తీసుకెళ్ల మంటే ఫ్రెండ్స్‌తో బిర్యాని తింటాం అంటారు.ఇంతకు వీరికి డబ్బు లెక్కువై నవా అంటే చెప్పలేం కాని రోగాలు తెచ్చుకోవడానికి మాత్రం డబ్బులు ఖర్చు చేస్తున్నారని మాత్రం అనుకోవచ్చూ.కాని మీరు ఏదైన రెస్టారెంట్‌కో,హోటల్‌కో వెళ్లాలంటే భయపడే సంఘటన నెల్లూరులో జరుగుతుంది.చికెన్ ఆర్డర్ ఇచ్చేముందు జర జాగ్రత్త.అక్కడ ఎలాంటి చికెన్ సర్వ్ చేస్తున్నారో ఓ కన్నేయండి.ఎందుకంటారా..నగరంలో కుళ్లిన చికెన్ దందా జోరుగా సాగుతోంది.కుళ్లిన చికెన్ తీసుకొచ్చి వండేసి..చక్కగా కస్టమర్లకు వడ్డించేస్తున్నా రు.ఈ కుళ్లిన చికెన్ దందా దెబ్బకు కార్పొ రేషన్ అధికారులు,పోలీసులే షాక్ తిన్నారట..




ఈ విషయం బయటకు వచ్చిన విధానాన్ని పరిశీలిస్తే నెల్లూరులో చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో..చికెన్ షాపుల యజమాను లు నిఘా పెట్టారట.గతంలో తమ దగ్గర చికెన్ కొనుగోలు చేసే రెస్టారెంట్లు,హోటళ్లవాళ్లు ఉన్నట్టుండి రావడం మానేశారట. ఏం జరుగుతుందని ఆరా తీసేసరికి వాళ్ళూ,వేరే వాళ్ల దగ్గర చికెన్ కొనుగోలు చేస్తున్నారని తేలింది. ఈ చీకటి వ్యాపారం బయటపడింది.వెంటనే ఈ సమాచారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పడంతో వారు తనిఖీలు నిర్వహించగా  భారీగా కుళ్లిన మాంసం కనిపించిందట,ఆ వ్యర్దాలను స్వాధీనం చేసుకుని.రెస్టారెంట్లు,హోటళ్లను సీజ్ చేశారట..



ఈ దందా ఎలాసాగుతుందో తెలిస్తే జీవితంలో హోటల్స్ ముఖం చూడరు.అదేంటంటే చెన్నైలో చికెన్ సప్లైయింగ్ వ్యాపారం జోరుగా సాగుతుందట.అక్కడ చికెన్ సప్లైయర్స్ చాలా మందే ఉన్నారట..వీరిలో కొందరు చెన్నై మున్సిపల్ సిబ్బందిగా బిల్డప్ ఇస్తూ అక్కడ మిగిలిపోయిన చికెన్ ను,పెద్ద పెద్ద హోటళ్లు,రెస్టారెంట్లలో నిల్వ ఉన్న కుళ్లిన చికెన్‌ను సేకరించి లారీల్లో నింపుతున్నారట.అంతేకాకుండా చెన్నైతో పాటూ చుట్టు పక్కల కోళ్ల ఫారాల్లో అనారోగ్యంతో చనిపోయిన కోళ్లని మాంసంగా మార్చేస్తున్నారట.ఈ చికెన్ మొత్తాన్ని బోర్డర్ దాటించి..పొరుగునే ఉన్న నెల్లూరు శివారులోని ఓ గోడౌన్‌కు తరలిస్తున్నారు .గోడౌన్‌కు తీసుకొచ్చిన చికెన్‌ను వాసన రాకుండా కెమికల్స్ కలుపుతూ,ఆ మాంసాన్నినెల్లూరుతో పాటూ చుట్టు పక్కల హోటళ్లు,రెస్టారెంట్లకు అమ్ముతున్నారు.అలాగే రోడ్డు పక్కన చికెన్ పకోడి చేసే వాళ్లకు తక్కువ రేటుకి అంటగడుతున్నారు పెద్ద పెద్ద హోటళ్లలో పనిచేసె సూపర్ వైజర్లు,వంటవాళ్లతో కుమ్మకై గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను నడిపిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: