ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఇద్దరు మంచి మిత్రులుగా మెలుగుతున్న సంగతి విధితమే. గత మూడు నెలలుగా ఈ బంధం బాగా గట్టి పడిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కెసిఆర్, చంద్రబాబు నాయుడు మధ్య రాజకీయ శత్రుత్వమే కాదు వ్యక్తిగత పగ కూడా ఉంది, ఈ కారణంగా ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా అయిదేళ్ళ పాటు గడిపారు. 


ఈ నేపధ్యంలో గత రెండు సంవత్సరాలుగా విభజనకు సంబంధించిన అన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి, కెసిఆర్ మరియు జగన్ ఇప్పుడు 'స్నేహపూర్వక సంబంధాలు' కొనసాగిస్తున్నారు  చంద్రబాబు నాయుడు స్థానంలో జగన్ ఎపి సిఎం అయ్యాక హైదరాబాద్‌లో ఎపి, తెలంగాణ మధ్య ఉన్న ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజన సజావుగా సాగుతుందని భావించారు. ఆ దిశగానే అడుగులు  పడుతున్నాయని అంతా అనుకుంటున్నారు.


అయితే మొదట్లోనే ఈ ఇద్దరి మధ్య ఒక అంశంలో విభేదాలు వచ్చాయని అంటున్నారు. అదేంటి అంటే హైదరాబాద్‌లోని ఎపి జెన్‌కోకు చెందిన ఎపి ట్రాన్స్‌కోకు చెందిన ఆస్తులను విభజించడంలో భాగంగా రూ .900 కోట్లకు పైగా ఆస్తులను ఏపికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, తీవ్రమైన నగదు సంక్షోభం ఎదుర్కొంటున్న  జగన్ ఆ ఆస్తులను తెలంగాణకు వదిలేయాలని ప్రతిపాదించారు మరియు బదులుగా తెలంగాణకు 900 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరారు.


అయితే దీనికి కేసీయార్ నో చెప్పారని భోగట్టా.   కెసిఆర్ యొక్క ఆర్థిక క్రమశిక్షణ కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదని అంటున్నారు. దాంతో కేసీయార్ అంత నగదు ఇవ్వలేనని చెప్పేసినట్లుగా ప్రచారం సాగుతోంది. 900 కోట్ల రూపాయల నగదు చెల్లించలేమని టిఎస్ ప్రభుత్వం జగన్‌కు తెలిపింది, బదులుగా రూ .900 కోట్ల విలువైన విద్యుత్తును ఆంధ్రకు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఏపీకి  ఇప్పటికే తగినంత విధ్యుత్తు  ఉన్నందున జగన్ తెలంగాణా నుండి తీసుకోవడానికి   ఆసక్తి చూపడం లేదని టాక్. 


తీవ్రమైన నగదు సంక్షోభం ఎదుర్కొంటున్న తన నవరత్నాల‌కు నిధులు సమకూర్చడానికి జగన్ కు పెద్ద  అవసరం అని ఎపి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో కేసీయార్ ని డబ్బు మాత్రమే జగన్ అడుతున్నారని అంటున్నారు.  ఇద్దరి మిత్రుల మధ్య ఇపుడు డబ్బు పెద్ద అడ్డంకిగా  మారింది. తనకు మిత్రుడైన కేసీయార్ కొత్త సర్కార్ కి ఆదుకోలేకపోతారా అని ఆశపడిన జగన్ కి ఈ విధంగా ఆశాభంగం ఎదురైందని అంటున్నారు.


మరి జగన్ విన్నపాన్ని రాబోయే రోజుల్లో అయినా కేసీయార్ మన్నించి ఈ 'డబ్బు సమస్యను'  ఎలా పరిష్కరిస్తారో చూడాలి. హైదరాబాద్‌లో ఇలాంటి అనేక ఆస్తులు ఉన్నాయి, వీటిని ఎపి, టిఎస్‌ల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఆదిలోనే ఇలా బ్రేకులు పడితే రెండు రాష్ట్రాలకు ఇబ్బందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: