నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ అడ్డంగా బుక్కైపోయారు. రాజధాని ప్రాంతంలో భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉన్నదే. కానీ ఎవరెవరు చేశారు ? ఏ స్ధాయిలో జరిగింది ? అందుకున్న లబ్ది ఎంత ? అన్న విషయాల్లోనే క్లారిటి లేదు.

 

అలాంటిది మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే విషయమై మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, లోకేష్ తోడల్లుడు భరత్ ఇన్ సైడర్ ట్రేడింగ్ లో లబ్దిపొందిన వివరాలు బయటపెట్టారు. దాంతో భరత్ కౌంటర్ ఇచ్చారు. తమకు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే జయంతిపురం అనే గ్రామంలో భూములు వచ్చినట్లు చెప్పారు. అయితే తర్వాత తలెత్తిన లిటిగేషన్లో తమకు భూములు ఇంకా చేతికి రాలేదన్నారు. కాబట్టి తాము డబ్బులు కూడా కట్టలేదన్నారు.

 

దాంతో భరత్ వాళ్ళకు భూములిచ్చిన విషయంలో బొత్సా అబద్ధం చెప్పినట్లు ప్రచారం మొదలైంది. అయితే తాజాగా భరతే అబద్ధాలు చెప్పినట్లుగా సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భరత్ కు కిరణ్ హయాంలో భూములు ఇవ్వలేదని చంద్రబాబునాయుడు సిఎం అయిన తర్వాతే భూములు దక్కినట్లు చెప్పారు. 2015, జూలై 15వ తేదీన టిడిపి ప్రభుత్వమే భరత్ కు 498 ఎకరాలు కట్టబెట్టిందన్నారు.

 

భరత్ కు భూములు కట్టబెట్టిన తర్వాతే సదరు భూములను సిఆర్డీఏ పరిధిలోకి చేర్చినట్లు కూడా అధికారులు వివరించారు. ఎప్పుడైతే సిఆర్డీఏనే భరత్ భూ కేటాయింపుల విషయాన్ని వివరించటంతో భరత్ అడ్డంగా బుక్కైనట్లు అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2015లో తమకు భూములు దక్కితే కాంగ్రెస్ హయాంలోనే భూములు ఎలాట్ అయినట్లు భరత్ ఎందుకు అబద్ధాలు చెప్పారో అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: