హిందూ మతం సనాతన ధర్మంగా కూడా వ్యవహరిస్తాము. ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. క్రీస్తు పూర్వం నుండి మన భారతదేశం లో హిందూ మతం కలదు. చరిత్రలోకి వెళితే వేదాలు ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సంపదుల నుండి హిందూ మతం మనుగడ లోకి వచ్చిందని సారాంశం. మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్ఛస్థాయిలో ఉంది అనడానికి కారణం నాటి పురాతన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్న చారిత్రక దేవాలయాలు. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండే నిర్మించిన కట్టడాలు అనేకం మన భారతదేశంలో కనిపిస్తాయి. మరి వీటి ద్వారా హిందూ చరిత్ర పై మనకు అవగాహన అనేది కలుగుతుంది. మరి భారతదేశం లో వెయ్యి సంవత్సరాల కంటే ముందే నిర్మించబడిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

మరి అవి నాటి నుండి నేటి వరకు వన్నె తగ్గకుండా ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని యాత్రికులను ఆకర్షిస్తున్నాయి అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. వీటిని చూస్తే అప్పట్లోనే ఇంతటి అద్భుతమైన కట్టడాలను ఎలా కట్టార అనిపిస్తుంది. మరి ఈ రోజు మనం వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైన ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. అమర్ నాథ్ మహారాష్ట్రలోని శివునికి అంకితం చేయబడిన ఆలయం. దీనిని క్రీస్తు శకం ఒక వెయ్యి అరవై లో షిలహర రాజు చిత్త రాజు నిర్మించాడు. తర్వాత దీనిని ఆయన కొడుకు ముమ్ముని పునర్ నిర్మించాడు. అయితే పురాణాల ప్రకారం పాండవులు ఒక రాతి శిలతో దీనిని నిర్మించినట్లు చెబుతారు. షోర్ టెంపుల్ తమిళనాడులోని మామళ్లపురం మహాబలిపురం బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు వందలలో పల్లవుల రాజు రెండవ నరసింహవర్మన్ కాలంలో నిర్మించారు.

దక్షిణ భారతదేశం లోనే పురాతన కట్టడాలలో ఇది ఒకటి. సోమనాథ ఆలయం అంటే టక్కున గుర్తొచ్చేది మహమ్మద్ గజనీ. మరి ఈయన ఇక్కడ సంపదను కొల్లగొట్టి దేవాలయాన్ని నాశనం చేశాడు. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో కలదు. దీనిని సేన వంశీయులు శివుని మీద ఉన్న భక్తితో ఏడవ శతాబ్దంలో నిర్మించారు. బేలూరు కర్ణాటక రాష్ట్రంలో బేలూరు వద్ద యగుచి నది తీరాన విష్ణుకు అంకితం చేయబడిన చెన్నకేశవ ఆలయం కలదు. ఈ గుడిని హొయసల రాజవంశీయులు క్రీస్తు శకం పది, పదకొండు శతాబ్దాల మధ్య నిర్మించారు. కేదార్ నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగ జిల్లాలో కలదు మరి ఖచ్చితమైన సమయం తెలియదు కానీ ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశాన్ని సందర్శించిన తరువాత దేవాలయానికి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో కట్టారని చెబుతారు.

కేదార్ నాథ్ చేరుకోడానికి పధ్నాలుగు కిలోమీటర్ల ట్రెకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆది కుంబేశ్వర్ ఆలయం. చోరీల కట్టడం ఆది కుంబేశ్వర్ ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో కలదు. ఈ దేవాలయంలో శివుడు కొలువై ఉంటాడు. దీని నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో జరిగింది. ప్రస్తుతం ఇది ముప్పై వేల ఒక వంద ఎనభై ఒక్క చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పుష్కర్ భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతి కొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లో ఈ దేవాలయం కలదు. ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్తారు. కాంచీపురం వరద రాజ పెరుమాళ్ దేవాలయం. భగవంతుడు విష్ణువుకు అంకితం చేయబడింది. క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో ఈ గుడిని చోళులు కాంచీపురంలో కట్టించారు. కర్నాటకలోని బాదామి, బాగల్ కోట జిల్లాలో కలదు. ఇక్కడ అద్భుతమైన రాతి గుహ ఆలయాలను చూడవచ్చు. ఇవి చాలా వరకూ బౌద్ధ, జైన మతాలకు చెందినవి చాళుక్యులు వీటిని ఆరో శతాబ్దంలో నిర్మించారు.


వీరిలో రెండవ పులకేశి అగ్రగణ్యుడు. బద్రినాథ్ ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం లార్డ్ విష్ణుకు అంకితం చేయబడింది. అంతే కాకుండా చార్ ధామ్ యాత్రలో ఒకటి. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు సందర్శించిన తర్వాత ఇది హిందూ క్షేత్రంగా మారిపోయింది. లింగరాజ్ ఆలయం ఒడిషా లోని భువనేశ్వర్ లో అతి పెద్దది మరియు అతి పురాతనమైనది. కళింగ రాజులు దేవాలయాన్ని క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం శివుడు విరూపాక్ష ఆలయం హంపిలోని తుంగభద్ర నది ఒడ్డున కలదు. దీనిని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం శివుడు ఆయనను విరూపాక్ష రూపంలో భక్తులు కొలుస్తారు. ద్వారకాధీశ ఆలయం గుజరాత్ లో అరేబియా సముద్రం ఒడ్డున ద్వారకలో కలదు. ఈ దేవాలయాన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. అంతే కాకుండా చార్ ధామ్ యాత్రలో కూడా ఇది ఒకటి.


శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. దీని విస్తీర్ణం నూట యాభై ఆరు ఎకరాలు మహావిష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిది శతాబ్దాల మధ్య నిర్మించినట్లు చెబుతారు. మీనాక్షి అమ్మన్ ఆలయం ఇది మదురై మీనాక్షి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం పార్వతీదేవి. కైమూర్ బీహార్ లోని ముండేశ్వరి మాత ఆలయం కైమూర్ లో కలదు. ఇందులో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. ప్రస్తుతం ఇది ఆర్కిలాజికల్ సర్వే వారి ఆధీనంలో ఉంది. వారి అంచనాల ప్రకారం ఇది క్రీస్తు శకం ఒక వంద ఎనిమిదిలో నిర్మించినట్లు తెలుస్తుంది. అయిహులే దుర్గ ఆలయం. నార్త్ కర్ణాటక లోని అయిహులేకు చెందినది. ఈ దేవాలయం విష్ణువుకు అలాగే శివుడికి అంకితం చేయబడింది. చాళుక్యులు ఈ గుడిని క్రీస్తు శకం ఏడు నుండి ఎనిమిది శతాబ్దాల మధ్య నిర్మించారు.


దుర్గ అంటే రక్షించే తల్లి అని అర్థం. లెడ్కన్ దుర్గ ఆలయానికి దక్షిణంగా అయిహులే క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన శివాలయం. లెడ్ కన్ ఆలయం ఆ పేరు రావటానికి కారణం లడఖన్ అనే పేరుగల వ్యక్తి ఇక్కడ కొంత కాలం నివశించాడు. తిరుమల తిరుపతిలో మొదటి దేవాలయాన్ని నిర్మించింది తమిళ రాజు. ఈయన తొండై మండలం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు విష్ణువు కలలో కనబడి దేవాలయం నిర్మించమని అడిగాడట. వెనువెంటనే రాజు దేవాలయాన్ని నిర్మించాడు. మరి ప్రాచీన గోపురాన్ని మరియు ప్రాకారాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు. శ్రీశైలం చరిత్ర పురాతనమైనది. దీని గురించి మొదటి ప్రస్తావనలోకి వచ్చింది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో. పులోమావి నాసిక్ లో వేయించిన శాసనంలో అంటే ఈ క్షేత్రం రెండవ శతాబ్దానికి పూర్వమే వెలిసిందని చెప్పుకోవచ్చు.

తంజావూరు ఆలయం ప్రధానమైనది. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం రాజేశ్వర్ ఆలయం అని పిలుస్తారు. దక్షిణ భారత దేశంలో ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని మొదటి రాజు చోళుడు క్రీస్తు శకం ఒక వెయ్యి పది లో పూర్తి చేశాడు. మరి అదే బృహదీశ్వర ఆలయం. కైలాస గుహ భారతదేశంలో ఉన్న రాతి కట్టడాల నిర్మాణంలో కైలాస ఆలయం అతి పెద్దది. ఇది మహారాష్ట్రలోని ఎళ్ళారలో కలదు. ఇందులోనే ఒక రాయి పల్లవుల కాలాన్ని తెలియజేస్తుంది. అంటే బహుశా దీని నిర్మాణం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చేపట్టి ఉండవచ్చని అంచనా వేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: