బొత్స సత్యనారాయణ అన్న మాటలు పట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర రాజధాని ని అమరావతి నుంచి ఎలా మారుస్తారు అంటూ తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక చాలా అనే విషయం దాగుందని మనకి మెల్లగా అర్ధం అవుతోంది. అమరావతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలాది ఎకరాల భూములు దోచుకున్నారని గత మూడు నాలుగేళ్లుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వైసిపి ఎక్కడ అమరావతి నుండి రాజధానిని మార్చేస్తుందని టిడిపి నేతలు భయపడి చస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకూడదని తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు.

అయితే ఇక్కడే జగన్ తన రాజకీయ చతురతను చూపించబోతున్నారట. సిఆర్డిఏ లో వేలాది ఎకరాల భూములను అక్రమ మార్గాల ద్వారా టిడిపి నేతలు దోచుకున్నారని వైసీపీ మంత్రులు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. బాలయ్య అల్లుడు అయిన శ్రీ భరత్ మరియు బిజెపి నాయకుడు సుజనాచౌదరి ఆక్రమించిన భూములకు సంబంధించిన కొన్ని పత్రాలను చూపించి బొత్స సత్యనారాయణ ఇప్పటికే వారి బాగోతం మొత్తం బయటపెట్టారు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక రాజధాని మార్చేస్తే భూములకు రేట్లు దారుణంగా పడిపోయి వారికి మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దాని నివారించేందుకే తెలుగుదేశం నేతలు ఇంత లాగా గొంతులు చించుకుంటున్నారట. 

ఇక టిడిపి పార్టీలో కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రి అయిన ప్రముఖ విద్యా సంస్థ స్థాపకుడు నారాయణకు సిఆర్డిఏ పరిధిలో లో 10 వేల కోట్ల రూపాయల విలువ చేసే 3129 ఎకరాల భూములు ఉన్నాయని వైసీపీ నేత రవీంద్ర సంచలన ఆరోపణలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఒక న్యూస్ ఛానల్ లో ఈయన చెప్పుకొచ్చింది ఏమిటంటే తాను నారాయణ పైన ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయడం లేదని తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు.... ఇంకా సేకరిస్తున్నట్లు కూడా రవీంద్ర చెప్పారు.

అయితే వీరిని చట్టప్రకారం నేరుగా శిక్షించడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ భూములతో నారాయణ మరియు మిగతా నేతలకు నేరుగా సంబంధం లేకపోయినా బినామీ పేర్లతో కూడా ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అమరావతిని రాజధానిగా తీసివేస్తే వారి పరిస్థితి ఏమిటని వారు గగ్గోలు పెడుతున్నారు. ఒక్క మాట రాజధాని తరలిస్తున్నారు అని బయటకు రాగానే టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమైనా ఐదేళ్లలో సిఆర్డిఏ పరిధిలో జరిగిన భూముల అవకతవకలపై వైఎస్ఆర్సిపి చాలా సీరియస్ గా యాక్షన్ కు రెడీ అవుతుండటం అదే సమయంలో రాజధాని తరలిస్తున్నారని ఒక్క మాట బయటకు రాగనే గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు తెలుగుదేశం పార్టీ నేతలు రియాక్ట్ అవ్వడం అంతా చూస్తుంటే జగన్ గురి చూసి వేసిన ఒక మంచి ప్లాన్ గా కనబడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: