వ్యవసాయంలో కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు..రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీయడానికి డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు. అయితే వ్యవసాయానికి కూడా ఈ డ్రోన్ లను ఉపయోగించవచ్చని నిరూపిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా కు చెందిన ఓ రైతు. డ్రోన్ ల సాయంతో పంటలకు ఎరువులు వేస్తూ సమయాన్నీ డబ్బునీ ఆదా చేస్తున్నాడు. ఇందూరు రైతు లింబారెడ్డి డ్రోన్ టెక్నాలజీ వాడకం చూడడానికి చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాడెం గ్రామానికి చెందిన లింబారెడ్డి ఓ ప్రత్యేక డ్రోన్ ని  తయారు చేశాడు. తన వ్యవసాయ క్షేత్రంలో పంటలకు మందుల పిచికారీకి కూలీలు దొరక్క పోవటంతో ఏదో ఒకటి చేయాలని భావించాడు. ప్రత్యాన్మయంగా రకరకాల ఆలోచనలు చేశాడు.


చివరికి విదేశాల్లో డ్రోన్ లను వ్యవసాయానికి వాడుతున్నట్టు గమనించాడు. గూగుల్ ద్వారా డ్రోన్ లు వ్యవసాయానికి ఎలా పనికొస్తాయో తెలుసుకున్నాడు. తాను కూడా డ్రోన్ ల సాయంతో పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రోన్ తయారీకి విజయవాడ లో తనకు పరిచయమున్న ఓ నిపుణుల్ని సంప్రదించాడు. రైతుకు కావాల్సిన విధంగా డ్రోన్ తయారు చేయటానికి ఒప్పందం కుదిరింది. దాదాపు ఆరు లక్షల రూపాయలతో ఈ డ్రోన్ తయారు చేశాడు నిపుణుడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ డ్రోన్ రెడీ అయ్యింది.  బ్యాటరీల సాయంతో పని చేసే దీనికి పెద్ద పెద్ద రెక్కలు బిగించి పది లీటర్ల ట్యాంక్ ని అమర్చారు. ఆపరేటర్ ద్వారా డ్రోన్ ను నియంత్రిస్తూ పంటలకు మందులు పిచికారి చేసేలా దీన్ని తయారు చేశారు. ఫొటోలు తీసే డ్రోన్ కన్నా ఇది పెద్దగా ఉంటుంది. చిన్నపాటి హెలిక్యాప్టర్ల ఉంటుంది. మొత్తం ఆరు బ్యాటరీలుండే ఈ డ్రోన్ లు ప్రతిసారి రెండు బ్యాటరీలు అమరుస్తారు. ఈ రెండు బ్యాటరీ లు దాదాపు ఒక గంటపాటు పనిచేస్తాయి.


ఒక ఎకరం మందుల పిచికారీకి ఏడు నిమిషాలు మాత్రమే పడుతుంది. పది లీటర్ల ట్యాంక్ ని రెండు సార్లు నింపితే ఒక ఎకరం పొలం పిచికారి అవుతుంది. తన ఆరు ఎకరాల పొలాన్ని మూడు గంటలలోపే మందుల పిచికారి చేసినట్టు తెలిపాడు లింబారెడ్డి.   సాధారణంగా మనుషుల ద్వారా ఐతే ఎకరం పొలానికి పది ట్యాంక్ లో మందు అవసరం పైగా ఎకరానికి గంటన్నర సమయం కూడా పడుతుంది. కానీ ఈ డ్రోన్ ద్వారా ఎకరం పొలానికి మందు పిచికారి కేవలం ఏడు నిమిషాల్లోనే అయిపోతూ ఉండడంతో రైతు లు ఈ డ్రోన్ ద్వారా మందుల పిచికారి వైపు మొగ్గుచూపుతున్నారు. తన అవసరం తీరాక ఈ డ్రోన్ ని ఇతర రైతు లకు కిరాయికిస్తున్నాడు. రైతు ఎకరానికి నాలుగు వందల రూపాయల అద్దె కిస్తున్నారు రైతు దాదాపు పన్నెండు కిలోల బరువున్న ఈ డ్రోన్ ట్యాంకు లు మందు నింపాక ఇరవై రెండు కిలోల బరువుగా మారుతుంది.


ఇంత బరువున్న డ్రోన్ ఎగరేయడానికి తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే బ్యాటరీలు వాడతారు. దీన్ని పొలాల్ లోకి తీసుకువెళ్లడానికి ఆటో సాయం కూడా తీసుకుంటారు. ఐతే పొలానికి చేరిన ఈ డ్రోన్ అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చు తో పొలానికి కావలసిన మందులు పిచికారీ చేస్తోంది. సమయం, డబ్బు ఆదా అవుతూండటంతో ప్రభుత్వం ఇలాంటి డ్రోన్ లను తయారు చేసి ప్రతి మండలానికి నాలుగు లేదా ఐదు చొప్పున అందిస్తే రైతులకు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. రైతు లకు ఎంతో ఉపయోగపడే ఈ డ్రోన్ ను తయారుచేసిన నిజామాబాద్ జిల్లా రైతు లింబారెడ్డి అందరూ అభినందిస్తున్నారు. తమకు ఈ యంత్రాంగం చాలా బాగా ఉపయోగపడుతోంది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు తోటి రైతులు. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని ప్రభుత్వం  వెలుగులోకి తీసుకురావలంటూ ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: