కమ్యునికేషన్ గ్యాప్ బంధాలు అనుబంధాలను దెబ్బతీస్తుంది. ఇపుడు తెలంగాణ కమలంలో కూడా కమ్యునికేషన్ గ్యాప్ సమస్యలు తీసుకొస్తోంది. పార్టీ నేతల మధ్య గ్యాప్ ని క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఏ నేతల మధ్య గ్యాప్ వచ్చింది. అది హస్తిన దాకా ఎందుకు వెళ్లింది. తెలంగాణ బిజెపిలో సరికొత్త కలకలం మొదలైంది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు రాష్ట్ర నాయకత్వం పై ముగ్గురు ఎంపీలు ఫిర్యాదు చేశారట.


అలాంటిలాంటి కంప్లైంట్స్ కాదు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు రెండు పేజీల ఘాటైన లేఖ రాశారని నాంపల్లి బీజేపీ ఆఫీసులో తీవ్ర చర్చ నడుస్తోంది.ఇంతకీ ముగ్గురు ఎంపీలు రాసిన లేఖలో ఏముంది. లక్ష్మణ్ పై ఫిర్యాదు చేశారా లేక హోల్ సేల్ గా రాష్ట్ర నాయకత్వ మార్పును ప్రస్తావించారా పార్టీ ఆఫీసులో జరుగుతున్న వ్యవహారాలను నడ్డా దృష్టికి తీసుకెళ్లారా, కొత్త నాయకత్వం ఎదగకుండా సీనియర్లు చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టరా అనేది సస్పెన్స్ గా మారింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇటీవల జెపి నడ్డాకు లేఖ రాశారని తెలుస్తుంది.

ఈ లేఖలో ఏముంది అనే దానిపై పార్టీ ఆఫీసులో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురు ఫస్ట్ టైం ఎంపీలు ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గులాబీ హాట్ లైన్ నుంచి హస్తినలో అడుగు పెట్టిన ఈ ముగ్గురు ఎంపీలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదట. కనీసం పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వడం లేదట. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ లో కూడా సమయం ఇవ్వడం లేదట. పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం లేదని వీరు పార్టీ హైకమాండ్ ముందు వాపోయారట. ఇలా మామూలుగా కంప్లెంట్ చేస్తే లాభం లేదని ముగ్గురు ఎంపీలు కలిసి లేఖ రాశారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: