వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో కొంత మంది కీలక నేతల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే నలుగురు మీద కేసులు నమోదు అయ్యాయి. మరి కొంత మంది లిస్టులో ఉన్నారు. అయితే ఎవరు ఉన్నా లేకపోయినా ఆది నారాయణ రెడ్డి మాత్రం లిస్టులో ఉండాలి. ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆది ఎలా రెచ్చిపోయారో మనం చూశాము. అందుకే ఆది మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతిని తవ్వే పనిలో ఉంది వైసీపీ. అయితే ఆది నారాయణ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చీటికీ మాటికి జగన్ మీద విమర్శలు చేసేవారు. 


మిగతా వారు ఆచి తూచి స్పందిస్తే.. ఆది మాత్రం నా లాంటి తోపు లీడర్ కడపలోనే లేడని మీడియా ముందు జగన్ మీద విమర్శలు గుప్పించేవారు. అయితే అనూహ్యంగా టీడీపీ ఘోర ఓటమి .. ఆది నారాయణ రెడ్డి కూడా ఓడిపోవటంతో ఇప్పుడు అయన బయటికి రావటం లేదు. జగన్ తనను ఎక్కడ వేధిస్తాడో అని జగన్ ఫోబియో పట్టుకుందని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అయితే వైసీపీ పార్టీ నుంచి చాలా మంది ఫిరాయించిన ..  మనకు ఆది నారాయణ రెడ్డి మాత్రం  గుర్తుకు వస్తారు.


ఎందుకంటే జగన్ మీద ఘోరంగా విరుచుకుపడిన నేతల్లో అది నారాయణ రెడ్డి ఒకరు. అయితే ఆదినారాయణ రెడ్డికి చుక్కలు చూపేందుకు వైసీపీ పక్కాగా ఆది నారాయణ రెడ్డికి జైలు కూడు తినిపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అప్పట్లో ఆది చంద్రబాబు మెప్పు కోసం మీడియా ముందుకు వచ్చి జగన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. చాలా సార్లు తన స్థాయిని దాటి జగన్ ని విమర్శించేవారు. టీడీపీలో మంత్రి పదవిని కూడా దక్కించుకోవటంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయేవాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో అది నారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీడీపీ పార్టీ అయితే నామరూపాలు లేకుండా పోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: