ఏపీకి సంభందించిన రాజధాని విషయంలో బొత్స చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా గందరగోళాన్ని రేపుతున్నాయి. ఒక పక్క మిగతా మంత్రులు కూడా రాజధానిని మార్చే ఉద్దేశం లేదని చెబుతుంటే, బొత్స మాత్రం ఈ విషయంలో ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పడంతో మళ్ళీ గందరగొళం నెలకొంటుంది. దీనితో రాష్ట్ర ప్రజలు సహజంగానే ఆందోళనకు గురౌతున్నారు. మరో పక్క నాలుగు రాజధానులు అంటూ కొత్త కాన్సెప్ట్ తెర మీదకు వచ్చింది. దీనితో అసలేం జరుగుతుందని అందరికీ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు.


ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్. అయితే బొత్స చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే .. ప్రభుత్వం  రాజధాని మీద చర్చ జరిపిందని మాత్రం అర్ధం అవుతుంది. దీనిని బట్టి రాజధాని విషయంలో జగన్  ఎదో ఒక నిర్ణయం తీసుకొనబోతున్నాడని సమాచారం వస్తుంది.


జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెఫరెండం పెట్టి అక్కడ అమరావతి ఉండాలా వద్దా అని డిసైడ్ చేయబోతున్నాడని సమాచారం వస్తుంది. ఇదే గాని జగన్ చేస్తే టీడీపీ నోరు కూడా మూయించవచ్చని  .. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన టీజీ వెంకటేష్ మాటలు కూడా ఇప్పుడు బలాన్ని చేకూరుస్తున్నాయి. వెంకటేష్ చెబుతూ రాజధాని మార్పు ఖచ్చితంగా జరుగుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి పారేశారు. దీనితో రాజధానిని మార్చే యోచనలో వైసీపీ ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి ఇప్పుడు అందరికీ . 

మరింత సమాచారం తెలుసుకోండి: