భారతదేశం త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు పరుగులు పెడుతుందని అన్నారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక మార్పులు అవసరమని అందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను అధిగమించారని త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తామని నిర్మల సీతారామన్ తెలిపారు. 


ఈ విషయానికి గాను త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. ఆర్ధిక వ్యవస్ధని బలి పీఠం చెయ్యడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. బారి ప్రాజెక్టులకు రుణాలు తీసుకునే అంశంలో బ్యాంకుల కన్సార్షియం వ్యవస్థల్లో మార్పు తీసుకు వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 


కాగా ఆర్ధిక నేరగాళ్ళను వదిలి పెట్టె ప్రసక్తి లేదని, ఇప్పటి వరకు 3లక్షల 38వేల షెల్ కంపెనీలను మూసి వేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే రుణ ఎగవేత దారులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీతారామన్ తెలిపారు. కొన్ని బ్యాంకులు ఇప్పటికే రిపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు పీఎస్బీ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. 


ముఖ్యంగా బ్యాంకుల విలీనం పైనే నిర్మలా సీతారామన్ నిర్ణయాలు ప్రకటించారు.. ఆ ప్రభుత్వ బ్యాంకుల విలీనం ఇలా జరగనుంది. 


  • ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పీఎన్బీ, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరిస్తుంది.  
  • ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా అవతరిస్తుంది.
  • ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ విలీనం ద్వారా 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరిస్తుంది. 
  • కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరిస్తుంది. 
  • ఇకపై దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య మొత్తం 12కు పరిమితం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: