ఏపీ టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించింది. కోడెల, ఆయన కుమారుడు శివరాంపై వివిధ సెక్షన్ ల  కింద కేసులు నమోదు అయ్యాయి . ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కోడెల ఆయన కుమారుడు హై కోర్ట్ ని ఆశ్రయించారు . వీరి పిటిషన్ ని పరిశీలించిన కోర్ట్ బెయిల్  మంజూరు చేస్తూ  ఆదేశాలు జారీ చేసింది. కోడెల, ఆయన కుమారుడు శివరాం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను శుక్రవారం విచారించిన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు వెలువరించింది. సత్తెనపల్లి, నరసరావుపేటలో నమోదైన ఐదు కేసులకు సంబంధించి బెయిల్ మంజూరైనట్లు సమాచారం. ’ 


అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన సొంతానికి వినియోగించుకున్నారంటూ అసెంబ్లీ అధికారులు చేసిన ఫిర్యాదుతో  గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో  కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు అవ్వగా ...  కె ట్యాక్స్ పేరుతో కోడెల కురుంబ సభ్యులు దాడి  చేసారని...ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారని...అన్యాయంగా భూములు లాక్కున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వసూళ్లు తదితర .ఆరోపణలు రాగా బాధితులు చాలా మాది మోసపోయాం అంటూ మాజీ స్పీకర్ కోడెల ఇంటి పై దాడి యత్నించారు. పదవిని అడ్డం పెట్టుకుని చాలా మందిని బెదిరించాడంటూ బాధితులు వీరిపై కేసులు పెట్టారు . ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా కోడెల కు వ్యతిరేకంగా మారారు. దీంతో   కోడెల కుమారుడు కోడెల శివరాంపై నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో   ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ కోడెల, ఆయన కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.


.  



మరింత సమాచారం తెలుసుకోండి: