దేశంలో ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశాన్ని కుదిపేస్తోంది .  ఈ ఆర్ధిక మాంద్యాన్ని తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఆర్ధిక  మాంద్యాన్ని తగ్గించటానికి కొన్ని చర్యలు చేపట్టింది . ఈ నేపథ్యంలోనే బ్యాంకుల విలీనానికి శ్రీకారం చుట్టి ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం . ఇప్పటికి వరకు దేశం మొత్తం లో 27  ప్రభుత్వ రంగా బ్యాంకులు కొనసాగుతుండగా .. ఆర్ధిక మాంద్యం కారణంగా బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి వాటిని 12 బ్యాంకులకు కుదించేందుకు నిర్ణయం తీసుకుంది . ఈ విలీనం  ద్వారా కొన్ని ఖర్చులు తగ్గించేందుకు కేంద్రం యోచిస్తోంది .  కాగా ఈ నిర్ణయం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

.
కేంద్రం తీసుకున్న బ్యాంకుల విలీనానికి నిరసనగా ... ఇప్పటికే పలు బ్యాంకుల ఉద్యోగులు  సమ్మె బాట పట్టారు. తెలుగు రాష్ట్రాలకి చెందిన పలువురు నేతలు కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పు బడుతూ విమర్శిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే మచిలీ పట్నం ఎంపీ బాలశౌరి  (వైసీపీ) కేంద్ర ప్రభుత్వానికి లేక రాశారు . 90 ఏళ్ల కింద పట్టాభిరామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకులతో విలీనం చేయొద్దని...ఈ విలీనం ఆంధ్రుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని ...  దీనిపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు., , కార్పొరేషన్,  ఆంధ్రా , యూనియన్  బ్యాంకులను విలీనం చేయాల్సివస్తే... వాటిని ఆంధ్ర బ్యాంకు పేరు పెట్టి హెడ్ ఆఫీస్ ని ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటయ్యేలా చూడాలని కోరారు. ఈ విషయం పై ప్రధాని మోదీ. ఆర్ధిక మంత్రి  నిర్మల సీతారామన్ లను కలుస్తానని స్పష్టం చేశారు  బాలశౌరి.కాగా ఆర్ధిక మాంధ్యం తో దేశ ఆర్ధిక పూర్తిగా కుదేలెవ్వటంతో ...మాంద్యాన్ని తగ్గించటానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: