ఆరుగురు ముఠా సభ్యులు, ముప్పై యొక్క దొంగతనాలు, లక్షల రూపాయల సొమ్ము చోరీ. కరీంనగర్ లో వరుస దొంగతనాలతో హడల గొట్టారు. అలర్టైన పోలీసులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. ముఠా సభ్యులందరినీ అదుపు లోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. విచారణలో పోలీసులకు కళ్లు తిరిగే వాస్తవం తెలిసింది. ఈ ముఠాకు నాయకత్వం వహించింది ఓ టీనేజర్ అని తెలియడంతో షాక్ తగిలినంత పనైంది.


చక్కగా చదువుకో వలసిన వయస్సులో ఓ పదిహేడు సంవత్సరాల కుర్రాడు ఓ ముఠా తయారు చేయడంతో పాటు ఆ ముఠాతో కలిసి ముప్పై యొక్క దొంగతనాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లో ఉండే ఓ టీనేజర్ ఆకతాయ తనంగా దొంగగా మారాడు. క్రమక్రమంగా అదే అతని వృత్తి అయిపోయింది . అతను దొంగతనాలు చేయడమే కాదు తనకన్నా వయసులో పెద్దవాళ్లైన మరో ఆరుగురితో కలిసి ఓ టీమ్ ను తయారు చేశాడు . యూట్యూబ్ లో వీడియోలు చూసి దొంగతనంలో మెళకువలు తెలుసుకున్నాడు . తాను తెలుసుకున్న ట్రిక్స్ తో ముఠాను నడిపించాడు . చివరకు కరీంనగర్ పోలీసులకు ముఠాతో సహా చిక్కాడు . రాత్రి సెకండ్ షో సినిమా చూసిన తర్వాత తాళాలు వేసిన ఇళ్లను ఈ ముఠా టార్గెట్ చేసేది .


అయితే ఆ రాత్రి సమయంలో టీనేజర్ నాయకత్వంలో ఆరుగురు కలిసి దొంగతనాలు చేసేవారు . చివరకు వీరి దొంగతనాలకు అడ్డుకట్ట వేశారు పోలీసులు . ఈ ముఠా గురించి తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు . కరీంనగర్ పోలీసులు వీరి దగ్గర నుంచి యాభై మూడు తులాల బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి వస్తువులు, ఆరు బైకులు, ఏడు ఫోన్ లు, రెండు ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: