ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా 'నారా లోకేష్'పై ట్విట్టర్ వేధికగా పంచులు పేలుతున్నాయి. నారా లోకేష్ ఎప్పుడు ఎవరో ఒకరిని ఫాలో అవుతాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 


నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల ప్రసంగించాలని చూసి ఘోర అవమానాలపాలైన నారా లోకేష్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, టీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఫాలో అవుతున్నాడు అని అంటున్నారు నెటిజన్లు. ఆలా అనడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా ?


ఉందండి.. ఉంది కారణం. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్ప మానవతా హృదయం ఉన్న గొప్ప మనిషి, గొప్ప నాయకుడు. 'అన్న నాకు ఈ కష్టం ఉంది' అని ఒక్కసారి ట్విట్టర్ లో ట్విట్ చేస్తే చాలు స్పందించి వారి అవసరాన్ని తీర్చి ' మా కేటీఆర్ అన్న గొప్ప నాయకుడు'' అని అనిపించుకుంటారు కేటీఆర్ అన్న. 


అయితే 'నారా లోకేష్ కొత్తగా ట్విట్టర్ లో ఒకరి సమస్యపై స్పందించి, వారి అవసరాన్ని తీర్చి కేటీఆర్ ల ట్విట్టర్ నాయకుడు అవ్వాలి అనుకుంటున్నాడు' అని అంటున్నారు నెటిజన్లు. నెటిజన్లు అనడం కాదు కానీ నారా లోకేష్ ట్విట్టర్ అచ్చం కేటీఆర్ ల స్పందించి సేమ్ తో సేమ్ హెల్ప్ చేసి ఆ ఫోటోలను ట్విట్టర్ లో పెట్టాడు.    


దీంతో నెటిజన్లు స్పందిస్తూ బాబు ''నువ్వు బలే కాపీ కొడుతావు లోకేషు.. కానీ వారిలా నువ్వు కపి కొట్టడం కాదు నిన్ను చూసి మరికొందరు కాపీ కొట్టేలా ఏదైనా ట్రై చెయ్యి పప్పు... హెల్ప్ చేయు కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి పేరు కొట్టేదం అని చూడకు.. నువ్వు నిజంగా హెల్ప్ చేసావు అంటే అది ఏదో విధంగా ప్రజలకు తెలుస్తుంది'' అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: