ఏపీలో సీఎం జగన్ అవినీతి లేని పరిపాలను ఇస్తానని ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. ఈ విషయంలో మంత్రులకు కూడా క్లారిటీగా చెప్పారు. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి. కానీ జగన్ మాత్రం మంత్రులకు ఇవ్వాల్సిన వార్నింగ్స్ ముందుగానే ఇచ్చారు. ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు.


ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు. అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు. తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. జగన్ మంత్రుల మీద నిఘా పెట్టడానికి ఇంటెలిజెంట్ వ్యవస్థను పటిష్టం చేసారు. దీనితో మంత్రులు అందరూ జాగ్రత్తగా పని చేసినట్టు తెలుస్తుంది. 


అయితే క్షేత్ర స్థాయిలో వైసీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు జగన్ కు వివరించారు. గత 9 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డారని వారికీ గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఇద్దామని .. మేము కొంత మందికి సిఫార్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. దీనితో జగన్ .. ప్రభుత్వ కొలువుల్లో రాజకీయజోక్యాన్ని అసలు సహించనని .. అలా చేస్తే సిస్టమే చెడిపోతుందని .. ఈ వ్యవస్థను కాపాడటానికి ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని మంత్రులకు జగన్ క్లాస్ పీకారు. కార్యకర్తలకు చేయాల్సిన మేలు వేరే ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: