అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని ఆరు లక్షల పదిహేను వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని జనవరి ఆరు న జగన్ పుస్తకాలు విడుదల చేశారని దానికి సంబంధించి ఇంత వరకు నిరూపించలేదని ఏపీ బీజేపీ నేత దిలీప్ అన్నారు. బెంజి సర్కిల్ వద్ద భవన నిర్మాణ కార్మికులను దిలీప్ పరామర్శించారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా ఇంత వరకు అవినీతిని నిరూపించలేకపోయారని మరి వాళ్లు అవినీతికి పాల్పడ్డారని మాట్లాడే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టి ఓట్ల కోసమే ఆ పుస్తకాలు ప్రచురించారని దిలీప్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఆ పుస్తకాల్లో నిజముంటే ఇంత వరకూ అరెస్టులు ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును ప్రతి రోజూ బూతులు తిట్టినంత మాత్రాన అసెంబ్లీలో దూషించినంత మాత్రాన ప్రజలకు కడుపు నిండదని దిలీప్ అన్నారు. కార్మికులు రెండు పూటలు భోజనం చేయకపోతే ప్రభుత్వం వారికి ఏ విధంగా న్యాయం చేసినట్టు అని ఆయన ప్రశ్నించారు. మూడు నెలలుగా భవన కార్మికులు పని లేక ఒక్క పూట కూడా భోజనం చేసే పరిస్థితి లేదని వాళ్ల పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది అని ఆయన అన్నారు.


జగన్ పాలనలో సామాన్య ప్రజలు రోజుకు రెండు పూటలా తినలేని పరిస్థితి నెలకొందని దిలీప్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులను బిజెపి సహించదని ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు పూటలా పేదవానికీ కడుపు నింపని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేక పోయినా ఒకటేనని దిలీప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఏపి బిజెపి వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దామోదర్ విమర్శలు గుప్పించారు.


పాస్టర్ లకు గౌరవ వేతనం ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవోను లింక్ చేసిన దియోధర్ సీఎం జగన్ పై పలు ప్రశ్నలు సంధించారు. పాస్టర్ ల గౌరవ వేతనం కోసం ప్రభుత్వ నిధులతో సర్వే చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయనీ ఆక్షేపించారు. ఒక మతానికి అనుకూలంగా ప్రభుత్వ విధానాలున్నాయని ఆరోపించారు. అన్ని మతాల్లోనూ పేదలు ఎంతో మంది ఉన్నారని వారందరిని విస్మరించి కేవలం పాస్టర్ లకే అయిదువేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్ రియల్ ఎజెండా ఏమిటో చెప్పాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు దిలీప్.

మరింత సమాచారం తెలుసుకోండి: