జనసేన పార్టీ పుట్టింది 2014 మార్చి నెలలో. ఆ టైంలో ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలు వేరేగా ఉన్నాయి. రాష్ట్రం తెచ్చుకుని గెలిచిన ఆనందంతో తెలంగాణా ఉంటే  ఆంధ్ర ప్రజలు అవమాన భారంతో  విషాదంలో ఉన్నారు. వారి మనోభావాలను కనిపెట్టడంతో అన్ని పార్టీలు విఫలం అయ్యాయి. సరిగ్గా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు. ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు ప్రతి ఆంధ్రుడి గుండె నుంచి వచ్చినవే. అదే సమయంలో ఏపీ విభజనా గాయాలతో జనం అల్లాడిపోతూంటే రాజకీయం కోసం పెనుగులాడుతున్న అప్పటి  పార్టీల వైఖరిని చూసి పవన్ ఘాటైన కామెంట్స్ చేశాడు.


నిజంగా ఆ టైంలో పవన్ ఏపీకి ఓ పెద్ద హీరో అయిపోయాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని పవన్ ప్రకటించేసరికి చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. జనం సైతం మద్దతుగా నిలిచారు. కానీ తరువాత కొద్ది రోజులకే పవన్ తన చేతలతో  తానే ఆ వూపుని చంపేశారు. ఆయన టీడీపీకి, బీజేపీకి మద్దతుగా నిలిచి జనసేనను కోరుండి పోటీ నుంచి తప్పించారు. నిజంగా పవన్ చేసిన మొదటి పెద్ద తప్పు అది. రాజకీయంగా దిద్దుకోలేని తప్పు అది.


ఇక 2019 ఎన్నికల నాటికి ఏపీలో బలమైన ఫోర్స్ గా వైసీపీ దూసుకువస్తున్న వేళ పవన్ చిత్తశుద్ధితో స్థిరంగా విపక్ష పాత్రను పోషించి ఉంటే కొంత అయినా మేలు జరిగేది. కానీ ఆయన టీడీపీకి షాడో అన్న విమర్శలకు బలం చేకూరేలా వ్యవహరించడంతో ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. పైగా ఈసారి పోటీలో ఆయన సొంతంగా ఉండడం అన్నది చేసిన రెండవ అతి పెద్ద తప్పు. టీడీపీతో పొత్తు పెట్టుకుని దిగినా బాగుండేది. లేక వైసీపీతో జట్టు కట్టినా సరిపోయేది. 


ఇపుడు ఎన్నికలు అయిపోయాక పవన్ మళ్ళీ టీడీపీ వాయిస్ నే వినిపిస్తూ అమరావతిలో పర్యటించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి జనసేన‌లో ఉన్న వారికి ఎవరికీ చంద్రబాబుకు మేలు చేసే ఒక్క ప్రకటన అయినా పవన్ ఇవ్వకూడదన్న బలీయమైన అభిప్రాయం ఉంది. జనాల్లో కూడా ఏపీలో టీడీపీ పని అయిపోయింది. జగన్ కి పవన్ ప్రత్యామ్యాయం అన్న ఆలోచన వచ్చిన సమయంలో పవన్ కోరుండి టీడీపీకి బలాన్ని ఇచ్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


దీంతో జనసేన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతోందని అంటున్నారు. అయిదేళ్ళ నుంచి మొదలైన ఈ  డౌన్ ఫాల్ ఇపుడు పీక్స్ కి చేరుకుందని అంటున్నారు. ఎన్నికలు అయిపోయాక ఓ మాజీ మంత్రి  రావున కిషోర్  బాబు జనసేనకు గుడ్ బై కొడితే ఇపుడు మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆ పార్టీని వీడిపోతున్నారు. జనసేనలో నిజానికి బలమైన నాయకులే తక్కువ. ఇపుడు ఉన్న వారు కూడా తమ దారి తాము చూసుకుంటున్న వేళ చాలా వేగంగా తిరోగమన దిశగా పార్టీ అడుగులు పడుతున్నాయని అంటున్నారు. పవన్ ఇప్పటికైనా మేలుకుని తన సొంత అజెండాతో జనంలోకి వెళ్లాలని, కలలో అయినా టీడీపీ వైపు మొగ్గకుండా ఉంటేనే ఆయనకు, పార్టీకీ అది మేలు చేస్తుందని అంటున్నారు. మరి పవన్ అలా చేయగలరా.



మరింత సమాచారం తెలుసుకోండి: