కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి జీవితంలో ఊహించని షాక్ తగిలింది. చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపాలని ఢిల్లీ సీబీఐ కోర్ట్ ఆదేశించింది. తనను ఈడీ కస్టడీకి అప్పగించాలి అన్న చిదంబరం పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నెల పంతొమ్మిది వరకు తీహార్ జైల్లోనే ఉంటారు చిదంబరం. పధ్నాలుగు రోజుల పాటు తీహార్ జైల్లో ఉంటారు మాజీ మంత్రి చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే.


తనను తీహార్ జైలుకు పంపించొద్దని ఈడీ కస్టడీకి అప్పగించాలని ఆయన ప్రాధేయపడినప్పటికీ న్యాయమూర్తి పట్టించుకోలేదు. అంతకుముందు చిదంబరం బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే చిదంబరాన్ని పదిహేను రోజుల క్రితం సిబిఐ అరెస్ట్ చేసింది. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఆయనను తీహార్ జైలుకు తరలించారు. చిదంబరానికి తీహార్ జైల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని రోస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. ప్రత్యేక సెల్ లో టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించాలని సూచించింది.


చిదంబరానికి ఇద్దరు పోలీసులతో తీహార్ జైల్లో సెక్యూరిటీని కల్పించాలని కూడా న్యాయ స్థానం ఆదేశించింది. ప్రత్యేక సెల్ లో ఇతర ఖైదీలను ఉంచరాదు అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో జైల్ నెంబర్ ఏడుకు చిదంబరాన్ని తరలించారు. ఆయనకు అవసరమైన మందులు, వైద్య సాయం అందించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో తీహార్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోవాలన్న చిదంబరం యొక్క ప్రయత్నం విఫలంగా మారింది. తాను సర్రెండర్ అవుతా అన్నా కూడా చిదంబరం యొక్క మాటలను పక్కన పెట్టిన సీబీఐ చివరకు చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: