పోలవరంలో విషయంలో నవయుగ కంపెనీకి ఉద్వాసన పలుకుతూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒక పక్క హై కోర్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా జగన్ తాను అనుకున్న దానికి కట్టుబడి రీటెండరింగ్ కే మొగ్గు చూపారు. అయితే జగన్ చర్యల పట్ల కేంద్రం చాలా అసహనంగా ఉంది. జగన్ ఎంత చెప్పినా వినడం లేదని .. వేరే సీఎంలు అయితే మనం  చెప్పిన మాట వినేవారని .. జగన్ పెద్ద మొండి ఘట్టమని ఢిల్లీ అధిష్ఠానం వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వానికి .. కేంద్రానికి మధ్య దూరం పెరుగుతుంది. జగన్ చేస్తున్న పనులు కేంద్రానికి నచ్చడం లేదు.


ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్రం పదే, పదే వద్దని హెచ్చరిస్తుంది. ఇక పీపీఏల ఒప్పందం గురించి ఏకంగా కేంద్ర మంత్రి జగన్ కు లేఖ రాశారు. పీపీఏ ఒప్పందాల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయని .. అయితే ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం గట్టిగానే స్పందిస్తుంది. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్రం చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం ఇవేమి పట్టించుకునే పరిస్థితిలో లేరు. నా రూటే సెపరేట్ అనే మాదిరిగా ఉంది.


పోలవరం పనులు చేపడుతున్న నవయుగ కంపెనీని ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా రీటెండరింగ్ కు వెళ్లిన సంగతీ తెలిసిందే. దీనితో కేంద్రం పోలవరం విషయంలో మళ్ళీ రీటెండరింగ్ కు వెళ్లాల్సిన అవసరం ఏముందని పోలవరం అథారిటీకి లెటర్ రాసింది. దీనితో జగన్ కు కేంద్ర ప్రభుత్వం మధ్య సంభందాలు బెడిసికొట్టే పరిస్థితి వచ్చిందని చెప్పాలి. దీనితో  .. జగన్ వినే రకం కాదు అని  కేంద్రం ప్రభుత్వం చెబుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. 


జగన్ ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టు విషయంలో అవినీతి జరిగిందని నిరూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇబ్బందులు తప్పవు. పోలవరానికి నిధులు ఆపేసిన ఆశ్చర్యం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: