ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు విచారణకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ బిజీగా మారిపోయారు. రోజువారి కార్యక్రమాలతో తలమునకలైపోయారు జగన్. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలకు పాలన అందించటంలో తాను బిజీగా ఉన్నానని తన ప్లేస్ లో లాయర్ అశోక్ రెడ్డిని కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు.



ఈ పిటిషన్ పై మరికాసేపట్లో సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. కోర్ట్ జగన్ అభ్యర్థనను అంగీకరించే వీలుందా, తన ప్లేస్ లో లాయర్ అశోక్ రెడ్డిని కోర్టు కు హాజరయ్యేందుకు అనుమతిచ్చే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రతీ శుక్రవారం కూడా కోర్ట్ కు జగన్ ఇప్పటివరకూ హాజరు అవుతూ వచ్చారు. ఇదే క్రమంలో తాను ప్రజా పాలనలో బిజీగా ఉండటంతో హాజరు కావటం కుదరట్లేదు అని సిబీఐ కోర్ట్ లో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.



తాను అలా రావటం వల్ల దాదాపు రెండు రోజుల పాటు పాలనలో డిస్టబెన్స్ వస్తుందనీ, దాంతో పాటు ఆర్ధిక వ్యయం కూడా  ఎక్కువ అవుతుందని, అదే విధంగా తన ప్రొటోకాల్ కి సంబంధించి కూడా ఆలోచించి తన బదులు తన లాయర్ అశోక్ రెడ్డికి కోర్ట్ కి హాజరు అవుతారని దానికి అనుమతి ఇవ్వాలంటూ  సిబీఐ కి జగన్ విన్నవించుకున్నారు. అయితే దానిపై మరికొద్దిసేపట్లో విచారణ జరపనున్నారు. అయితే గతంలో జగన్ పై 14 కేసులు ఉన్నాయని దాంట్లో 12 కేసులు సిబీఐ మరియు రెండు ఈడి కేసులు ఉనాయ్ కాబట్టి విచారణ తుది దశలో ఉంది కాబట్టి జగన్ ఖచ్చితంగా హాజరు కావాలి అని అటు సిబీఇ కూడా కౌంటర్ ఇచ్చే అవకాశముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: